ntr-biopic-vs-ysr-biopic-yatra_

హైదరాబాద్: మాజీ సీఎం, దివంగత నేత డా.రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం యాత్ర. వైఎస్ జీవితం లో ఒక మైలురాయిగ నిలిచిపోయిన పాదయాత్రని ఇతివృతంగా తీసుకోని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు డైరెక్టర్ మహి. ప్రస్తుతం ఈ సినిమా పూర్తి పాజిటివ్ టాక్ తో బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది.

పేరుకి మాత్రమే యాత్ర సినిమా వైఎస్సార్ బయోపిక్ అయినా, వైసీపీ నేతలు, కార్యకర్తలెవరూ విడుదల ముందు వరకు కూడా సినిమాని పెద్దగా పట్టించుకోలేదు. యాత్ర పొలిటికల్ టచ్ లేకుండానే సినిమా నిర్మాణం పూర్తి చేసుకుంది.అలాగే యాత్ర ఫంక్షన్లకి కూడా రాజకీయ నాయకులెవరూ హాజరుకాలేదు. జగన్ కూడా సినిమా గురించి ఎక్కడా ఏ వేదికలపై కూడా మాట్లాడలేదు.

పొలిటికల్ టచ్ లేకుండా తెరకెక్కించడమే ప్లస్ పాయింట్…

అయితే రెండు రోజుల్లో ఈ సీన్ పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం యాత్ర మూవీ తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ పెంచింది. వైసీపీ నేతలు, కార్యకర్తలు ఈ సినిమాకు విపరీతమైన ప్రచారం తెచ్చారు. దాదాపు ఏపీ, తెలంగాణలోని అన్ని జిల్లాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్లిపోయారు. కడప, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో కోలాహలం మరీ ఎక్కువగా కనిపించింది.

ఎమ్మెల్యేలు, పార్టీ కీలకనేతలు తన అనుచరుల కోసం థియేటర్లలోని సీట్లన్నీ బుక్ చేయించారు. ఉదయం ఆటతోనే యాత్రకు వైఎస్సార్ అభిమానులు క్యూ కట్టారు. సినిమాకు పాజిటవ్ టాక్ రావడంతో కార్యకర్తల ఆనందానికి అవధుల్లేవు. వైసీపీ నేతలు సినిమాని ఓన్ చేసుకున్నా.. పార్టీలకతీతంగా ప్రజలు మొదటిరోజే సినిమాని చూడటానికి ఉత్సాహం చూపించారు.

అందులో మిస్ అయిందే.. ఇందులో హిట్ అయింది…

ముఖ్యంగా ఎన్టీఆర్ బయోపిక్‌కి, వైఎస్సార్ యాత్రకు తేడా తెలుసుకోవడం కోసం ఎక్కువమంది చూశారు. ఎన్టీఆర్-కథానాయకుడులో ఏది మిస్ అయిందో, యాత్ర సినిమాలో సరిగ్గా అదే హిట్ అయింది. అదే ఎమోషన్. భావోద్వేగాలు పెర్ ఫెక్ట్ గా పండడమే యాత్రకు ప్లస్ అయింది.

రెండు సినిమాల మధ్య ఇదే పెద్ద తేడా అంటున్నారు విశ్లేషకులు. ఎన్టీఆర్ షూటింగ్ మొదలైనప్పటి నుంచి టీడీపీ నేతలు చేసిన ఓవరాక్షన్ ఆ సినిమాకి మైనస్ కాగా, సినిమా విడుదల వరకు వైసీపీ నేతలు పాటించిన సంయమనం యాత్రపై పొలిటికల్ రిమార్క్ లేకుండా చేసింది. రిలీజ్ దగ్గరపడినప్పుడు మాత్రమే నేతల సందడి కనిపించింది. మొత్తానికి యాత్ర సినిమా వైసీపీలో జోష్ పెంచగా, టీడీపీ నేతలు ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్-2 ఫలితం ఎలా ఉంటుందో అని అయోమయంలో పడ్డారు.

సంబంధిత వార్తలు

‘యాత్ర’కి పోటీగా బరిలోకి దిగనున్న ఎన్టీఆర్ బయోపిక్!?

మన గడప తొక్కి సాయం అడిగిన ఆడ బిడ్డతో రాజకీయం ఏంట్రా? యాత్ర ప్రీమియర్స్ షో టాక్?

యాత్ర మూవీ ట్విట్టర్ రివ్యూ!


English Title:

ysr biopic yatra vs ntr biopic ntr kathanayakudu big difference