‘లక్ష్మీస్ ఎన్టీఆర్’: వర్మకి మరో ఎదురుదెబ్బ! సెన్సార్ క్లియర్ అవుతుందా?

4:26 pm, Wed, 20 March 19
1
Ram Gopal Varma Latest News, Lakshmi's NTR Latest News, Tollywood Updates News, Newsxpressonline

హైదరాబాద్: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాకి మొదటి నుండి ఓ వర్గం నుండి వ్యతిరేకత ఎదురవుతూనే ఉంది. ఇప్పటికే కొందరు టీడీపీ నేతలు ఈ సినిమా విడుదల ఆపాలని ఈసీకి, కోర్టుకి ఫిర్యాదులు చేశారు.

మళ్ళీ కేసు..

అవన్నీ దాటుకొని సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. సెన్సార్ పూర్తి చేసి ఈ నెల 29న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించారు. అయితే ఇప్పుడు ఈ సినిమాపై మరో కంప్లైంట్ నమోదైంది. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాకు సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ రద్దు చేయాలని హైదరాబాద్ లోని సెన్సార్ బోర్డు కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

విజయవాడకి చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి ఈ కంప్లైంట్ చేసినట్లు తెలుస్తోంది. టీడీపీ, చంద్రబాబును కించపరిచేలా ఈ సినిమాలో సీన్లు ఉన్నాయంటూ ఫిర్యాదు చేశారు. మరి దీనిపై సెన్సార్ బోర్డ్ ఎలా స్పందిస్తుందో చూడాలి. అలాగే ఎటువంటి పరిస్థితుల్లోనైనా కూడా ఈ రిలీజ్ ఆగదు అని చెప్తున్నా వర్మ దీనిపై ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి..