27.6 C
Hyderabad
Wednesday, November 4, 2026
- Advertisement -
Home క్రికెట్ ఐపీఎల్‌‌లో ఇప్పటివరకు నమోదైన అత్యంత చెత్త రికార్డులు ఏవో తెలుసా?

ఐపీఎల్‌‌లో ఇప్పటివరకు నమోదైన అత్యంత చెత్త రికార్డులు ఏవో తెలుసా?

ipl
- Advertisement -

ఢిల్లీ: ఇప్పటివరకూ 11 సీజన్లు పూర్తిచేసుకున్న ఐపీఎల్‌ 12వ సీజన్‌కు సిద్ధంగా ఉంది. మరో మూడు రోజుల్లో చెన్నై సూపర్‌కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు మధ్య మొదటి మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో ఇప్పటివరకూ నమోదైన అత్యంత చెత్త రికార్డులను ఒకసారి చూస్తే..

ఐపీఎల్‌లో అతితక్కువ పరుగులు:

ఐపీఎల్‌ అంటేనే పరుగుల వరదకు కేరాఫ్‌ అడ్రస్‌. అరవీర భయంకర, భీకర బ్యాటింగ్‌ లైనప్‌ కలిగిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు జట్టు ఐపీఎల్‌లో అత్యంత తక్కువ 49 పరుగులకే ఆలౌటై చెత్తరికార్డును మూటగట్టుకుంది. 2017లో ఈడెన్‌గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్‌నైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఈ రికార్డును నమోదు చేసింది.

మొదట బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా 132 పరుగులు స్వల్ప లక్ష్యాన్ని ప్రత్యర్థి జట్టుకు నిర్దేశించింది. అనంతరం ఛేదనకు దిగిన ఆర్సీబీ కేవలం 49 పరుగులు మాత్రమే చేసి చేతులెత్తేసింది. ఇందులో ఏ ఒక్క బ్యాట్స్‌మన్‌ కూడా రెండంకెల స్కోరు చేయలేకపోవడం గమనార్హం.

అత్యధిక ఎక్స్‌ట్రాలు: 2008లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డెక్కన్‌ ఛార్జర్స్‌ జట్టు 28 అదనపు పరుగులు ఇచ్చింది. ఐపీఎల్‌ చరిత్రలో ఇవే అత్యధిక అదనపు పరుగులు.

అత్యధికసార్లు డకౌట్‌: ఐపీఎల్‌లో ఇప్పటివరకూ అత్యధికంగా 13 సార్లు హర్భజన్‌సింగ్‌ డకౌటయ్యాడు.

అత్యధిక ఓటములు: 11 సీజన్లలో మొత్తం 91సార్లు దిల్లీ డేర్‌డెవిల్స్‌ ఓటమిపాలైంది. మరే ఇతర జట్లు ఇన్ని ఓటములు చవిచూడలేదు.

అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌ : సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలర్‌ బసిల్‌ థంపి ఒకే స్పెల్‌లో (నాలుగు ఓవర్లు) అత్యధికంగా 70 పరుగులు ఇచ్చాడు.

- Advertisement -