హైదరాబాద్: రెండు రోజుల క్రితం టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ తన కుమార్తె అర్హతో ముద్దుముద్దుగా మాట్లాడుతూ, “నాన్న చెప్పిన అబ్బాయిని పెళ్ళి చేసుకో నాన్నా…” అనగా,  దానికి అర్హ అంతే ముద్దుగా ‘చేసుకోను’ అంటున్న వీడియో ఎంత వైరల్ అయిందో అందరికీ తెలిసిందే.

అబ్బ ఛా… నువ్వు చేసుకున్నావా?

ఇక ఈ వీడియో లైక్ ల మీద లైక్ లు, షేర్ల మీద షేర్లు తెచ్చుకుని వైరల్ అవుతుండగా, ఇదే వీడియోపై అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి స్పందించింది. ఇదే సమయంలో ఆ వీడియోను షేర్ చేస్తూ, “నువ్వు చేసుకున్నావా? మీ నాన్న చెప్పిన అమ్మాయిని!?” అని కామెంట్ పెట్టింది స్నేహ.

స్నేహారెడ్డి పోస్టుపై స్పందించిన అల్లు అర్జున్ “అబ్బ ఛా… నువ్వు చేసుకున్నావా!?” అని సరదా కామెంట్ పెట్టాడు. కాగా, వీరిద్దరూ కామన్‌ ఫ్రెండ్స్‌ ద్వారా ఒకరికి ఒకరు పరిచయమై, కొన్నాళ్ల ప్రేమ తరువాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి కామెంట్లు ఇప్పుడు మరింతగా వైరల్ అవుతున్నాయి.

చదవండి: కిల్ బిల్ పాండే ఈజ్ బ్యాక్! బ్రహ్మానందాన్ని పరామర్శించిన అల్లు అర్జున్!

చదవండి: దొంగ ఫెలో.. చేసుకుంటానని చెప్పు: కూతురితో అల్లు అర్జున్ సరదా ముచ్చట!


English Title:

allu arjun wife snehareddy strong countar againest her husband bunny