మహేష్‌పై వచ్చే రూమర్ నిజం కాదు? నమ్రత ఏం చెప్పిందంటే…

9:28 am, Sun, 10 February 19
Mahesh_Babu_Maharshi_ comments on dil raju

హైదరాబాద్ : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు, నమ్రత ప్రేమ వివాహానికి నేటితో 14 ఏళ్లు. మహేష్-నమ్రత పెళ్లి రోజు ఈ ఆదివారం. అలాగే, వరల్డ్ మ్యారేజ్ డే (ఫిబ్రవరిలో రెండో ఆదివారం) కూడా ఈ రోజే.

ఈ సందర్భంగా నమ్రత మాట్లాడుతూ మహేష్‌తో ప్రేమ, పెళ్లి, పెళ్లి తరవాత జీవితం గురించి నమ్రత కొన్ని విషయాలు చెప్పింది.

మహేష్‌కి నేనే ప్రపోజ్ చేశా…

వంశీ షూటింగ్‌కు మహేష్, నేను న్యూజీలాండ్ వెళ్ళాము. అప్పటికి మేం ఫ్రెండ్స్. తిరిగొచ్చాక ప్రేమలో వున్నామని అర్థమైంది. లవర్స్ అయ్యాము. ముందు నేనే ప్రపోజ్ చేశా. మహేష్‌కి ఫోన్ చేసి చెప్పా. అప్పటికి తనూ నన్ను ప్రేమిస్తున్నాడు. ఒకరి గురించి మరొకరికి పూర్తిగా తెలుసు. పెళ్లి చేసుకోవాలనుకున్నాం.

పెళ్లి తరవాత సినిమాల్లో నటించడం నాకిష్టం లేదు. కెరీర్‌కి, కుటుంబానికి న్యాయం చేయలేనని నా ఫీలింగ్‌. మహేష్ కూడా నాన్ వర్కింగ్ వైఫ్ కావాలని కోరుకున్నాడు. ఒకవేళ నేను సినిమాల్లో నటిస్తే కొన్ని రోజులు మహేష్‌కి దూరంగా వుండాలి. నాకు అదీ ఇష్టం లేదు. అందుకని, అప్పటికి నేను అంగీకరించిన సినిమాలు పూర్తి చేశాక పెళ్లి చేసుకున్నాం.

పెళ్లి తరవాత ఎప్పుడూ నటించాలని అనిపించలేదు. నటన గురించి ఆలోచించేంత సమయమూ నాకు లేదు. పిల్లలు, ఫ్యామిలీతో సరిపోతుంది. సరదాగా అతిథి పాత్రలు చేయాలని కూడా అనిపించలేదు.

మహేష్ తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక నా ప్రమేయం వుంటుందని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అబద్ధం. మహేష్ నిర్ణయాల్లో నా జోక్యం వుండదు. స్వంత నిర్ణయాలు తీసుకుంటారు అని చెప్పుకొచ్చింది. నా జీవితంలో పెళ్లి తరవాత ఈ 14 ఏళ్లు బెస్ట్. పెళ్లి నాకు దక్కిన బెస్ట్ & స్పెషల్ గిఫ్ట్.

చదవండి : హైదరాబాద్‌కి మహేశ్ బాబు మైనపు విగ్రహం! ఏఎంబీ సినిమాస్‌లో ప్రదర్శన!