మెగాస్టార్ సైరా మూవీలో మరో మెగాహీరో?

sairaa

మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు సురేందర్ రెడ్డి సైరా నరసింహారెడ్డి సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు.ఇకపోతే ఈ సినిమాలో మెగాస్టార్ సరసన నయనతార నటిస్తుంది.

ఈ సినిమాలో ఇప్పటికే తమన్నా, అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి వంటి హేమా, హేమీలు నటిస్తున్నారు. మెగా డాటర్ నీహారిక కొణిదెల కూడా కనిపించబోతుందని సమాచారం. భారీ బడ్జెట్ తో సినిమాను రూపొందిస్తోన్న రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో అతిథి పాత్రలో కనిపిస్తాడని అంటున్నారు.

తాజాగా మరో వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్ లో హల్చల్ చేస్తుంది. సైరాలో మరో మెగాహీరోకి ఈ సినిమాలో ఛాన్స్ వచ్చినట్లు సమాచారం. కథ ప్రకారం సినిమాలో ఓ కీలమైన పాత్రను ఎవరైనా మెగాహీరోతో చేయిస్తే బాగుంటుందని యూనిట్ భావిస్తోంది. ఈ మేరకు మెగా క్యాంప్ హీరోలతో చర్చలు కూడా మొదలైనట్లు తెలుస్తోంది.

చిరంజీవి సినిమా, పైగా చరణ్ నిర్మాత కాబట్టి ఏ మెగా హీరో ఈ ఛాన్స్ మిస్ చేసుకోడు. అయితే ఎవరిని ఫైనల్ చేయబోతున్నారనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.