మేకప్ లేని చందమామ… కాజల్ ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే..!

2:45 pm, Sat, 1 June 19
kajal-agarwal-without-makeup

లైట్స్… కెమెరా.. యాక్షన్… స్టార్ట్… ఇది సినిమా ప్రపంచం. అందం, అభినయం, వినోదం పంచడమే కీలకం ఇక్కడ. విభిన్న పాత్రల్లో అలరించిన నటీనటులు… ఎప్పుడూ మేకప్‌లోనే కనిపిస్తారు తప్ప… విత్ అవుట్ మేకప్ అభిమానులకు కనిపించేందుకు ఇష్టపడరు. కానీ… కలువ కళ్ల నటి కాజల్ అగర్వాల్… తాజాగా ఆ సాహసం కూడా చేసేసింది.

చదవండి: మహేశ్ సినిమాలో నటిస్తున్నా: విజయశాంతి

తేజ దర్శకత్వంలో చందమామ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కాజల్… తెలుగు, హిందీ, తమిళ భాషల్లో మెరిసింది. అగ్ర కథానాయకుల పక్కన నటించి మెప్పించిన ఈ అందాల భామ… తన అందం, నటనతో ఆకట్టుకుంది.

ఎందరో అభిమానుల్ని సంపాదించుకున్న కాజల్ అగర్వాల్… మేకప్ లేకుండా ఉన్నప్పటి తన ఫోటోను తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. నిజమైన అందం అంటే ఇదేనంటూ… నేచురల్ ఫోటోస్‌ను పోస్ట్ చేసింది.

కాజల్ పోస్ట్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు. ఇలాంటి పిక్స్ షేర్ చేసేందుకు చాలా గట్స్ ఉండాలని.. మేకప్ ఉన్నా లేకున్నా మీరు ఏంజెల్‌లా ఉంటారంటూ కొంతమంది నెటిజన్లు కాంప్లిమెంట్స్ ఇచ్చారు. 

చదవండి: ఆసుపత్రి నుంచి మురళీమోహన్ డిశ్చార్జ్.. పరామర్శించిన చిరంజీవి