26.4 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ 9న ఏపీకి రానున్న మోడీ.. శ్రీవారి దర్శనం అనంతరం సీఎం జగన్‌తో భేటీ!

9న ఏపీకి రానున్న మోడీ.. శ్రీవారి దర్శనం అనంతరం సీఎం జగన్‌తో భేటీ!

Narendra Modi Latest News, YS Jagan News, AP Latest News, Newsxpressonline
- Advertisement -

న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్రమోడీ ఈ నెల 9న తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన ఖరారైనట్టు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.

చదవండి: కృష్ణా జిల్లాలో టీడీపీకి షాక్: వైసీపీలో చేరనున్న సీనియర్ నేత…

మాల్దీవులు, శ్రీలంక పర్యటన నుంచి భారత్‌కు చేరుకోనున్న మోడీ 9న సాయంత్రం ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకుంటారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో తిరుమల తిరుపతిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేసేందుకు అధికారులు రెడీ అవుతున్నారు.

జగన్‌తో సమావేశం…

మోడీ తిరుమల పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. జగన్ కూడా మోడీతో జరిగే భేటీలో ఏపీకి రావాల్సిన నిధులు, లోటు బడ్జెట్, ఆర్థిక ఇబ్బందులను ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలని  నిర్ణయించినట్టు సమాచారం.

చదవండి: గవర్నర్లుగా వెళ్లనున్న సుష్మా, సుమిత్ర..!

కాగా, రెండోసారి ప్రధానిగా ఎన్నికైన మోడీ గురువారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావాలని వైఎస్ జగన్ తొలుత భావించినా.. ఆ తరువాత అనుకోని కారణాలతో హాజరుకాలేకపోయారు. 

- Advertisement -