
హైదరాబాద్: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ రానా దగ్గుబాటి ఎట్టకేలకు తన ప్రేమాయణంపై నోరు విప్పాడు. హీరోయిన్లతో వస్తున్న డేటింగ్ వార్తలకు చెక్ పెట్టాడు.
సినీ పరిశ్రమతో ఏమాత్రం సంబంధం లేని అమ్మాయిని పెళ్లాడబోతున్నట్టు తాజాగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. మిహీక బజాజ్ అనే పక్కా హైదరాబాదీని వివాహమాడబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేశాడు.
లండన్ చెల్సియా యూనివర్సిటీలో ఆర్ట్స్ అండ్ డిజైన్ విభాగంలో మిహీక బజాజ్ ఎంఏ పూర్తి చేసింది. ఆ తర్వాత తల్లి బంటీ బజాజ్‌కి వెడ్డింగ్ ప్లానింగ్ బిజినెస్ లో సహాయం చేసింది.
2017లో సొంతగా డ్యూ డ్రాప్స్ అనే ఒక ఇంటీరియర్ డిజైన్ సంస్థను ప్రారంభించింది. ఇప్పుడు వెడ్డింగ్ ప్లానింగ్ బిజినెస్‌తో పాటుగా ఈ ఇంటీరియర్ డిజైన్ కంపెనీ బాధ్యతలు కూడా నిర్వహిస్తోంది.
చదవండి: ‘డిన్నర్’ అంటే అదే.. క్యాస్టింగ్ కౌచ్ సీక్రెట్ కోడ్ వర్డ్ బయటపెట్టేసిన కామసూత్ర బ్యూటీ
వెంకటేశ్ కుమార్తె ఆశ్రితకు మిహీక మంచి స్నేహితురాలని సమాచారం. లాక్‌డౌన్ సమయంలో గుడ్ న్యూస్ చెప్పిన రానాకి సినీ ప్రముఖులు నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
చిరంజీవి, సమంత, ఉపాసన, తమన్నా, నిఖిల్, అల్లు శిరీష్, నిహారిక, హన్సిక, కియారా అద్వాణీ, సుషాంత్, రాశి ఖన్నా, శృతిహాసన్ తదితరులు తమ సోషల్ మీడియా ద్వారా ఈ జంటకి శుభాకాంక్షలు చెబుతున్నారు.
Congratulations my Boy @RanaDaggubati Finally the mighty #BhallalaDeva is struck by #Cupid & Getting hitched. #Lockdown leads to #WedLock. God Bless You Both! శతమానం భవతి. @MiheekaBajaj pic.twitter.com/fDdHbjhivz
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 12, 2020
మెగాస్టార్ చిరంజీవి రానా తమ ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. ‘‘కంగ్రాచ్యులేషన్ మై బోయ్.. ఎట్టకేలకి భళ్ళాలదేవుడు పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమయ్యాడు. మీ పెళ్లి లాక్‌డౌన్‌ని అధిగమిస్తుంది. ఇద్దరికి నా ఆశీర్వాదాలు. శతమానం భవతి..’’ అని ట్వీట్ చేశారు.
చదవండి: ప్రభాస్ అభిమానులకు పండుగ.. వైరల్ అవుతున్న 20వ సినిమా లాంచింగ్ ఫొటోలు
రానా గతేడాది ఎన్టీఆర్ బయోపిక్‌లో చంద్రబాబు నాయుడు పాత్రలో కనిపించి అలరించాడు. ఆ తర్వాత హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘హౌస్‌ఫుల్ 4’ సినిమాలో కీలక పాత్ర పోషించాడు.
ప్రస్తుతం రానా హీరోగా నటించిన ‘అరణ్య’ విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే, విరాట పర్వం సినిమా చేస్తున్నాడు. రానా నటించిన చారిత్రాత్మక చిత్రం 1945 విడుదల కావాల్సి ఉంది.











