21.7 C
Hyderabad
Friday, November 6, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ అదిరిపోయే ఐటమ్‌సాంగ్‌కి సిద్దమౌతున్న రామ్!

అదిరిపోయే ఐటమ్‌సాంగ్‌కి సిద్దమౌతున్న రామ్!

manisharma-puri-ram , newsxpress.online
- Advertisement -

manisharma-puri-ram, newsxpress.online

టాలీవుడ్: టాలీవుడ్ యంగ్ హీరో రామ్ హీరోగా పూరి జగన్నాథ్ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ రఫ్ లుక్ తో కనిపిస్తూ , మాస్ ఆడియన్స్ లో ఆసక్తిని రేపుతున్నాడు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది. ప్రస్తుతం యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.

నోరాఫతేహితో ఐటమ్ సాంగ్ …

ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నాడు. గతంలో పూరి – మణిశర్మ కాంబినేషన్లో వచ్చిన ‘పోకిరి’ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమాలో ‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే .. ‘అంటూ సాగిన ఐటమ్ సాంగ్ ఇప్పటికీ కుర్రాళ్ల గుండెల్లో సందడి చేస్తూనే వుంది.

ఆ ఐటమ్ సాంగ్ కి మించిన ట్యూన్ చేయమని పూరి చెప్పడంతో .. మణిశర్మ ఆ పనిని పూర్తిచేశాడని అంటున్నారు. త్వరలోనే ‘నోరా ఫతేహి’పై ఈ ఐటమ్ సాంగ్ ను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది.

చదవండి : నితిన్ కొత్త చిత్రం షూటింగ్ ముహూర్తం ఫిక్స్!

- Advertisement -