

కోటబొమ్మాళి మండలంలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. రైతు బజారు ప్రారంభోత్సవం కోసం వైసీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని టీడీపీ శ్రేణులు తొలగించాయి. ఇరువర్గాల మధ్య గొడవకు ఫ్లెక్సీ తొలగింపు కారణమైంది.
టీడీపీ నుండి వైసీపీకి వలసల పర్వం..
కోటబొమ్మాళి వైసీపీ కార్యాలయం ఎదుటే ఇరుపార్టీల కార్యకర్తలు తన్నుకున్నారు ఒకదశలో. వైసీపీ కార్యాలయంలోకి వెళ్లి మరీ టీడీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు.ఈ దాడిలో ఐదుగురు వైసీపీ కార్యకర్తలు గాయపడ్డారు. టీడీపీ, వైసీపీ కార్యకర్తల దాడుల్లో స్థానికులకు సైతం గాయాలయ్యాయి.
గాయపడిన వారిని టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రి కి తరలించారు. మరోవైపు తోట వెంకటరమణ అనే కార్యకర్త పరిస్థితి విషమంగా ఉండటంతో శ్రీకాకుళం రిమ్స్ కు తరలించారు. ఇరుపార్టీల వివాదం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్ళి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. వైసీపీలో టీడీపీ శ్రేణుల చేరికను తట్టుకోలేకే తెలుగుదేశం పార్టీ నేతలు దాడులకు దిగారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
మంత్రి అచ్చెన్నాయుడే దాడి చేయించారని ఆగ్రహించిన వైసీపీ శ్రేణులు కోటబొమ్మాళి పోలీసు స్టేషన్ ముందు ధర్నాకు దిగాయి. దాడికి ప్రేరేపించిన వారిని అరెస్టు చేసే వరకూ ఆందోళన విరమించమని వైసీపీ శ్రేణులు తెగేసి చెబుతున్నాయి.
చదవండి : చంద్రబాబుతో భేటీ: టీడీపీలోకి మాజీ కేంద్రమంత్రి కిశోర్ చంద్రదేవ్








