హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న కీరవాణి చిన్నకొడుకు.. మరో కొడుకు సంగీత దర్శకుడిగా…

Keeravani son
- Advertisement -

Keeravani son

హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్‌ఎమ్ కీరవాణి ఫ్యామిలీ నుంచి ఓ హీరో రాబోతున్నాడన్న టాక్‌  సినీ వర్గాలలో జోరుగా వినిపిస్తోంది. కీరవాణి చిన్న కుమారుడు సింహా త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడట.  మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది.

మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణంలో తెరకెక్కనున్న డిఫరెంట్‌ సినిమాతో సింహా అరంగేట్రం దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తోంది. అంతేకాదు.. మరో విశేషం ఏమిటంటే ఈ సినిమాతోనే కీరవాణి మరో పెద్ద కుమారుడు కాల భైరవ కూడా సంగీత దర్శకుడిగా మారనున్నాడట.  ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి పూర్తి వివరాలు మైత్రీ మూవీ మేకర్స్‌ త్వరలో వెల్లడించనుంది.

హీరోగా అరంగేట్రం చేయబోతున్న సింహా.. రామ్ చరణ్ తేజ్, సమంత జంటగా నటించిన ‘రంగస్థలం’ సినిమాకి స్టార్ డైరెక్టర్ సుకుమర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌‌గా పని చేశాడట.  చూద్దాం.. సింహా నటన ఎలా ఉంటుందో, ఆయన్ని తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో!

 

- Advertisement -