ఓట్లు ఎత్తుకెళ్లిపోయే గ్యాంగులని చూస్తున్నాం: టీడీపీ నేతలపై పవన్ కళ్యాణ్ సంచలన ట్వీట్

Pawan Kalyan
- Advertisement -

Pawan Kalyan1

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఇంకా తెలుగుదేశం పార్టీ నేతలపై మరోసారి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. టీడీపీ నేతలు ఓట్లను ఎత్తుకుపోతున్నారంటూ పవన్ పేర్కొన్నారు.

‘‘చిన్న పిల్లల్ని ఎత్తుకెళ్లిపోయే గ్యాంగులు గురించి వింటాం. ఓట్లు ఎత్తుకెళ్లిపోయే గ్యాంగులను చూస్తున్నాం. మరి తెలుగుదేశం నాయకులు దీని గురించి ఏం మాట్లాడతారో.. నేను ఎదురు చూస్తున్నాను. Party leaders have taken the decision to lodge a complaint with ‘Election Commission అంటూ గురువారం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.

ట్వీట్‌తో పాటు ఓ ఇంగ్లీష్ ప్రతికలో తెలుగుదేశం పార్టీ నేతలు ఓటర్ల జాబితాను ట్యాంపరింగ్ చేస్తున్నారంటూ వచ్చిన కథనాన్ని కూడా పోస్ట్ చేశారు.. మరి  పవన్ ట్వీట్‌పై తెలుగుదేశం పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

- Advertisement -