

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ముందు నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అందరూ ఊహించినట్లుగానే అన్ని రంగాలతోపాటు రైతులు, మధ్యతరగతి ప్రజలపై వరాల వర్షం కురిపించింది. పార్లమెంటులో శుక్రవారం ఉదయం 11 గంటలకు తాత్కాలికంగా ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న పీయూష్ గోయల్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. అంతకుముందు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోయే తాత్కాలిక బడ్జెట్‌కు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
మోడీ సారథ్యంలో సుస్థిర పాలన అందించామని ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆయన లోక్‌సభలో మాట్లాడారు. వృద్ధిరేటులో 11వ స్థానంలో ఉన్న భారత్ 6వ స్థానానికి చేరిందన్నారు. బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా అనారోగ్యంతో చికిత్స తీసుకుంటున్నా ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ త్వరగా కోలుకోవాలని పీయూష్ గోయల్ ఆకాంక్షించారు.
ప్రీయూష్ గోయల్ బడ్జెట్ ప్రసంగం
-దేశ ఆత్మ విశ్వాసాన్ని మోడీ ప్రభుత్వం పెంచింది.
– 2022లోగా నవ భారతాన్ని చూడబోతున్నాం.
– దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా గాడినపడుతోంది.
– రైతుల ఆదాయం రెట్టింపైంది.
– గడిచిన ఐదేళ్లలో ద్రవ్యోల్బణాన్ని గణనీయంగా తగ్గించాం.
– విధాన నిర్ణయాల్లో వేగం పెంచాం.
– జీడీపీ వృద్ధిరేటు గణనీయ పురోగతి సాధించాం.
– దివాళా చట్టం ద్వారా అక్రమాలను అరికట్టాం.
రైతులపై వరాల వర్షం: ఏడాదికి రూ.6వేలు
– ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి 75వేల కోట్లు
– పేద రైతులకు ఆదాయం పెంపును చర్యలు చేపట్టాం.
– కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు ఏడాది రూ.6వేలు అందిస్తాం.
– 2 హెక్టార్ల లోపల(5 ఎకరాలు) వ్యవసాయ భూమి ఉన్న రైతులకు కొత్త పథకంలో లబ్ధి పొందనున్నారు.
– మూడు దఫాలుగా ఈ మొత్తం నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతుంది. దీని ద్వారా 12కోట్లమంది రైతులు లబ్ధి పొందుతారు.
– కిసాన్ క్రెడిట్ కార్డుల కింద రుణాలు
– రైతు పెట్టుబడి సాయం 2018 డిసెంబర్ నుంచే అమలు
– రుణాలు సకాలంలో చెల్లించినవారికి రాయితీలు
– ప్రకృతి విపత్తుల కారణంగా నష్టపోయినవారికి రుణాల రీషెడ్యూల్
-పాడిపరిశ్రమ రుణాలు సకాలంలో చెల్లించే వారికి అదనపు మూడు శాతం వడ్డీ రాయితీ
4.6శాతానికి ద్రవ్యోల్బణం
– ద్రవ్యోల్బణం 4.6శాతానికి తీసుకొచ్చాం.
– సంస్థాగతమైన ఆర్థిక సంస్కరణలలో ముందుకు సాగుతున్నాం.
– రికార్డు స్థాయిలో ఎఫ్‌డీఐలు భారత దేశానికి వచ్చాయి. జీఎస్‌టీ సహా పన్నుల వ్యవస్థల్లో సంస్కరణలు అమలు చేస్తున్నాం.
– రూ.3లక్షల కోట్ల మొండి బకాయిలను వసూలు చేశాం.
అన్ని ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు, అన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం
– మార్చి వరకు దేశంలో అన్ని ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చాం.
– 22 రకాల పంటలకు మద్దతు ధర పెంచాం. ప్రధానమంత్రి సడక్‌యోజనకు రూ.19వేల కోట్లు ఖర్చు చేశాం.
– ఇప్పటివరకూ రూ.3వేల కోట్ల పేదల ధనం ఆదా అయింది.
– 2014కు ముందు బస్సు సౌకర్యం లేని అన్ని గ్రామాలకు ఆ సౌకర్యం కల్పించాం.
50కోట్ల మందికి అండగా ఆయుష్మాన్ భారత్
– గ్రామీణ, పట్టణాల మధ్య అంతరాల తొలగింపునకు కృషి చేస్తున్నాం.
– గ్రామీణ ప్రాంతాల్లో జీవన ప్రమాణాలను మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
– గ్రామీణ సడక్‌యోజనలో భాగంగా మూడింతల రహదారుల నిర్మాణం పెరిగింది.
– మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి పథకానికి రూ.60వేల కోట్లు ఖర్చు చేశాం.
అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్ కల్పించాం
– మా ప్రభుత్వం అవినీతి రహిత ప్రభుత్వం.
– ప్రత్యేక (రేరా) చట్టం ద్వారా బినామీ లావాదేవీలను నిరోధించగలిగాం.
– మా ప్రభుత్వ పాలన దేశంలో ప్రతి ఒక్కరి ఆత్మ విశ్వాసాన్ని పెంచింది.
– మా ప్రభుత్వం ప్రతి కార్యక్రమాన్ని నిజాయతీగా అమలు చేస్తోంది.
– పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్లను దేశానికి తిరిగి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నాం.
– గ్రామీణ భారతంలో 98శాతం మరుగుదొడ్లు నిర్మించాం.
గోవుల రక్షణ కోసం ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలకైనా వెనుకాడదు.
– గోకుల్ మిషన్ కోసం రూ.750కోట్లు కేటాయిస్తున్నాం.
– గో ఉత్పాదకత పెంచడానికి రాష్ట్రీయ కామ్‌ధేన్ ఆయోగ్ ఏర్పాటు.
గ్రాట్యుటీ పరిమితి 30లక్షలకు పెంపు
– గ్యాట్యుటీ పరిమితిని రూ.10లక్షల నుంచి రూ.30లక్షలకు పెంచుతున్నాం.
– కొత్త పెన్షన్ విధానం సరళీకరిస్తాం!
– పెన్షన్‌లో ప్రభుత్వ వాటా 14శాతానికి పెంపు.
– కార్మికులు, కూలీల కోసం ప్రత్యేక పథకాలు.
– ఈపీఎఫ్‌వో సభ్యుల సంఖ్య రెండేళ్లలో 2కోట్లు పెరిగింది.
– కార్మిక ప్రమాద బీమా మొత్తం రూ.1.50లక్షల నుంచి రూ.6లక్షలకు పెంపు
60ఏళ్లు నిండిన వారందరికీ ప్రతి నెలా రూ.3వేలు పింఛన్
– ప్రధానమంత్రి శ్రమయోగి బంధన్ పేరుతో అసంఘటిత కార్మికులకు పింఛను ఇస్తున్నాం.
– 60ఏళ్లు నిండిన వారందరికీ ప్రతి నెలా రూ.3వేలు పింఛన్ వచ్చే విధంగా పథకం.
– నెలకు రూ.100 చొప్పున ప్రీమియం చెల్లిస్తే 60ఏళ్ల తర్వాత రూ.3వేల పింఛన్.
– సంఘటిత రంగంలోని 10కోట్లమంది కార్మికులకు ఈ పథకం వర్తింపు.
– ఈఎస్‌ఐ పరిమితి రూ.15వేల నుంచి రూ.21వేలకు పెంపు
– ఈఎస్‌ఐ పరిమితిని రూ.15వేల నుంచి రూ.21వేలకు పెంచుతున్నాం.
– రూ.15వేల నెల జీతం ఉండే వేతన జీవులకు కొత్త పథకం.
– కొత్త పెన్షన్ పథకం ప్రధాన మంత్రి శ్రమ్ యోగి మాన్‌ధన్‌కు రూ.500కోట్లు కేటాయింపు.
– పీఎం కౌషల్ యువజన యోజన కింద కోటిమంది యువతకు శిక్షణ ఇచ్చాం.
ఎన్నడూ లేని విధంగా రక్షణ రంగానికి రూ.3లక్షల కోట్లు
– రక్షణ రంగానికి రూ.3లక్షల కోట్లు కేటాయిస్తున్నాం.
– అవసరమైతే మరిన్ని నిధులు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం.
– 40ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న వన్ మ్యాన్ వన్ పెన్షన్ తామే అమలు చేశాం.
– దేశ రక్షణలో సైనికుల త్యాగం నిరుపమానం.
ఉజ్వల యోజన కింద 8కోట్ల ఉచిత వంటగ్యాస్ కనెక్షన్లు
– ముద్ర యోజనలో రూ.7.23లక్షల కోట్ల రుణాలు ఇచ్చాం.
– దేశంలో 100 ఎయిర్‌పోర్టులు క్రియాశీలకంగా ఉన్నాయి.
– ప్రపంచంలోనే రహదారుల నిర్మాణం భారత్‌లో వేగంగా సాగుతోంది.
– రోజుకు 27కి.మీ. రహదారిని నిర్మిస్తున్నాం.
రైల్వేకు రూ.64,500కోట్లు
– భారతీయ రైల్వేలకు రూ.64,500 కోట్లు కేటాయిస్తున్నాం.
– బ్రాడ్‌గేజ్‌లో కాపలాలేని లెవల్ క్రాసింగ్‌లను తొలగించాం.
-దేశంలో కాపలాదారులు లేని రైల్వే క్రాసింగ్‌లను లేకుండా చేశాం.
– అత్యధిక వేగంగా ప్రయాణించే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రానుంది.
మొబైల్‌లో డేటా వినియోగం గణనీయంగా పెరిగింది
– మొబైల్‌లో డేటా వినియోగం 50రెట్లు పెరిగింది.
– డిజిటల్ రంగంలో మౌలిక సదుపాయాలు కల్పించాం.
-ప్రపంచంలోనే డేటా, ఫోన్ ఛార్జీలు భారత్‌లో తక్కువగా ఉన్నాయి.
– జన్‌ధన్, ఆధార్, మొబైల్, డైరెక్ట్ ట్రాన్స్‌ఫర్‌లు కీలకంగా మారాయి.
– గత ఐదేళ్లలో 34 లక్షల కోట్ల జనధన్ ఖాతాలు ప్రారంభమయ్యాయి.
మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట: ఆదాయపుపన్ను పరిమితి రూ. 5లక్షలకు పెంపు
– ఆదాయపుపన్ను పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.2.50లక్షల నుంచి రూ.5లక్షలకు పెంపు.
– వార్షిక ఆదాయం రూ.5లక్షల వరకూ ఉన్న వేతన జీవులు ఇకపై ఆదాయపుపన్ను చెల్లించనవసరం లేదు.
– రూ.6.5లక్షల వరకూ ఉన్న వారికి బీమా, పెన్షన్ ఫండ్‌లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా రాయితీ.
– స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి రూ.40వేల నుంచి రూ.50వేలకు పెంపు
- ఇంటి అద్దె పన్ను పరిమితిని 2.4లక్షలకు పెంపు
వచ్చే ఐదేళ్లలో భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్
– వచ్చే ఐదేళ్లలో 5ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించనుంది
– రవాణా వాహనాల్లో భారత్ జోరు చూపిస్తోంది.
– ఎలక్ట్రానిక్ వాహన వినియోగం పెరిగింది.
– 2030కల్లా ఈ రంగంలో సింహ భాగం భారత్‌దే.
సినిమా నిర్మాణ అనుమతి కోసం సింగిల్ విండో విధానం
– భారతీయ సినిమాల నిర్మాణం అనుమతి కోసం సింగిల్ విండో విధానం తీసుకురానున్నాం.
– జీఎస్‌టీ విధానంతో ఉత్పత్తిదారులు, వినియోగదారులకు ప్రయోజనం చేకూరింది.
– ఎక్కువ వస్తువులు 0-0శాతం శ్లాబుల్లోనే ఉన్నాయి.
– పైరసీని అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం.
– సినిమాలపై జీఎస్టీ 12శాతానికి తగ్గింపు
– ఇళ్ల కొనుగోలుదారులకు జీఎస్టీ మినహాయింపుపై తర్వలో నిర్ణయం తీసుకుంటాం.
– మంత్రి-వర్గ ఉపసంఘం నివేదికను జీఎస్టీ మండలి ముందు ప్రవేశపెట్టి తుది నిర్ణయం తీసుకుంటాం.
వచ్చే ఐదేళ్లలో 5ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్
– వచ్చే ఐదేళ్లలో భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్.
-రవాణా వాహనాల్లో భారత్ జోరు. ఎలక్ట్రానిక్ వాహన వినియోగం పెరిగింది.
-2030కల్లా ఈ రంగంలో భారత్‌దే అగ్ర భాగం.
-అంగన్‌వాడీ టీచర్ల జీతం 50శాతం పెంపు
– 2022 నాటికి ప్రతి ఒక్కరికి ఇళ్లు
– దేశవ్యాప్తంగా అత్యంత వెనుకబడిన 150 జిల్లాలపై ప్రత్యేక దృష్టి
– దేశంలో ప్రస్తుతం 21 ఎయిమ్స్, త్వరలోనే హర్యానాలో 22వ ఎయిమ్స్
– అంగన్‌వాడీ టీచర్ల జీతం 50 శాతం పెంపు
ఇది మధ్యంతర బడ్జెట్ మాత్రమే కాదు: పీయూష్ గోయల్
ఇది కేవలం మధ్యంతర బడ్జెట్ మాత్రమే కాదని, దేశ ప్రగతికి మార్పునకు వాహనంలాంటిదని ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి అనేది ప్రజా ఉద్యమంగా సాగుతోందని స్పష్టం చేశారు. కాగా, మధ్యతరగతి ప్రజలు, రైతులు, ఎస్సీఎస్టీలపై వరాలు కురిపిస్తున్న సమయంలో అధికార పక్షం హర్షధ్వానాలతో హోరెత్తించింది. ‘దేఖో రాహుల్’ అంటూ నినాదాలు చేసింది.








