

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడి రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పాదయాత్రలో ఉన్న జగన్ హైదరాబాద్‌కి వెళ్ళడానికి విశాఖ ఎయిర్ పోర్ట్‌కు చేరుకోగానే సెల్ఫీ పేరుతో దగ్గరికొచ్చిన శ్రీనివాసరావు అకస్మాతుగా జగన్‌పై కోడి కత్తితో దాడి చేశాడు.
ఈ అనూహ్య ఘటన నుంచి వెంటనే తేరుకున్న ఎయిర్ పోర్ట్ సిబ్బంది శ్రీనివాస్‌ని పట్టుకొని పోలీసులకి అప్పగించారు. ప్రస్తుతం ఈ కేసుని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) టాకిల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే వైఎస్ జగన్‌ను చంపాలన్న ఉద్దేశంతోనే ఆయనపై శ్రీనివాసరావు కత్తితో దాడికి పాల్పడ్డాడని జాతీయ దర్యాప్తు సంస్థ తేల్చింది.
ముందస్తు పథకంలో భాగంగానే…
శ్రీనివాసరావు ముందస్తు పథకంలో భాగంగానే 2018 జనవరిలోనే కోడి పందేల సందర్భంగా తన ఊరికి సమీపంలో కత్తిని సంపాదించాడని పేర్కొంది. ఈ విషయాలన్నింటినీ జనవరి 12 నుంచి 18 వరకు తాము చేపట్టిన విచారణలో శ్రీనివాసరావు స్వయంగా వెల్లడించాడని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టుకు తెలిపింది.
శ్రీనివాసరావు చర్యలు పౌర విమానయాన చట్టంలోని సెక్షన్ 3ఏ(1)(ఏ) కింద చట్ట వ్యతిరేక కార్యకలాపాల పరిధిలోకి వస్తాయంది. అంతేకాక జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడం ద్వారా ఐపీసీ 307 సెక్షన్ కింద కూడా నేరానికి పాల్పడ్డారంది. ఈ నేరాలను విచారణ నిమిత్తం స్వీకరించాలని ఎన్ఐఏ కోర్టును కోరింది.
సంబంధిత వార్తలు
కోడికత్తి కేసు: చంద్రబాబు ప్రభుత్వానికి షాక్, ఎన్ఐఏ దర్యాప్తుపై స్టేకు హైకోర్టు నిరాకరణ








