23.7 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం కస్టమర్లను మోసం చేస్తున్న స్నాప్‌డీల్?: దర్యాప్తునకు సీఈఆర్‌సీ ఆదేశం

కస్టమర్లను మోసం చేస్తున్న స్నాప్‌డీల్?: దర్యాప్తునకు సీఈఆర్‌సీ ఆదేశం

snap-deal-cheating
- Advertisement -

న్యూఢిల్లీ: దేశీయ ఆన్‌లైన్‌ రిటైల్‌ పోర్టల్‌ స్నాప్‌డీల్‌ వినియోగదారులకు మోసం చేస్తోందని తాజాగా వెల్లడైంది. భారీ డిస్కౌంట్లు ఇచ్చేందుకు పలు వస్తువుల ఎంఆర్‌పీలను తమకనుకుగుణంగా స్నాప్‌డీల్‌ పెంచేస్తోందని, అంతేగాక, కాస్మెటిక్‌ ఉత్పత్తులపై ముగింపుగడువు తేదీని చూడా చూపడం లేదని అహ్మదాబాద్‌కు చెందిన కన్సూమర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చి సెంటర్‌ (సీఈఆర్‌సీ) వెల్లడించింది.

ఉత్పత్తుల ధరలు పెంచి అమ్మడం వల్ల వినియోగదారులు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని పేర్కొంది. ఈ క్రమంలో అధిక ధరలతో, అరకొర లేబిలింగ్‌తో ఉన్న ఉత్పత్తులన్నింటినీ స్నాప్‌డీల్‌ ఉపసంహరించేలా చర్యలు చేపట్టాలని డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీజీసీఐ)ని సీఈఆర్‌సీ కోరింది.

ఇప్పటికే విక్రయించిన హానికారక ఉత్పత్తులను వెనక్కి తీసుకుని వినియోగదారులకు పరిహారం చెల్లించాలని సీఈఆర్‌సీ ఆదేశించింది. వెండార్లు, ఉత్పత్తుల ఎంపికలో కంపెనీ పారదర్శక విధానం పాటించాలని, పాలసీ ఉల్లంఘనలకు పాల్పడిన వెండార్లపై కఠిన చర్యలు చేపట్టాలని సూచించింది. స్నాప్‌డీల్‌లో ఉత్పత్తుల వారీగా ఎంత ధరలకు విక్రయిస్తున్నారనే దానిపై సమగ్ర దర్యాప్తు అవసరమని సీఈఆర్‌సీ సీజీఎం ప్రీతి షా డిమాండ్‌ చేశారు.

- Advertisement -