పరుగులు పెడుతున్న బంగారం ధర.. సామాన్యులకు అందేనా?

- Advertisement -

హైదరాబాద్: అంతర్జాతీయంగా బలమైన ట్రెండ్‌కు తోడు జువెల్లర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పెరగడంతో బంగారం ధర కళ్లెం లేకుండా పరుగులు పెడుతోంది. గత కొద్ది రోజులుగా పెరుగుతూ పోతున్న ధర ఆదివారం ఏకంగా ఆకాశాన్నంటింది. 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు ఏకంగా వెయ్యి రూపాయలు పెరిగి హైదరాబాద్‌లో ఏకంగా రూ.37,170కి చేరుకుంది. 22 క్యారెట్ల పసిడి ధర కూడా రూ.1000 పెరిగి రూ. 34,160కు ఎగబాకింది.

మరోవైపు వెండితోపాటు పరుగులు తీసే వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. కిలోకు రూ.44,965 వద్ద స్థిరంగా ఉంది. పరిశ్రమ యూనిట్లు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడమే ఇందుకు కారణమని మార్కెట్ వర్గాలు తెలిపాయి. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో 99.9 స్వచ్ఛత కలిగిన పది బంగారం ధర రూ.450 పెరిగి రూ.36,090కు చేరింది. 99.5 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.450 పెరిగి రూ.34,900కు ఎగసింది. వెండి ధర కిలోకు రూ.44,965 వద్ద స్థిరంగా ఉంది.

- Advertisement -