JIO Prepaid Plans: జియో నుంచి సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్! 3 నెలలు ‘డిస్నీ+ హాట్‌‌స్టార్’ ఫ్రీ…

- Advertisement -

ముంబై: జియో తన వినియోగదారుల కోసం డీస్నీ+ హాట్‌స్టార్ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో కూడిన కొన్ని ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌‌లను ఐపీఎల్ ప్రారంభంలోనే ప్రవేశపెట్టింది. అవేంటో, వాటితో కలిగే ప్రయోజనాలు ఏమిటో.. మీరూ ఓ లుక్కేయండి!

రూ.151 ప్లాన్:

ఈ ప్లాన్ వ్యాలిడిటీ 90 రోజులు. ఇది కేవలం డేటా ప్లాన్, అంటే వాయిస్ కాలింగ్, ఎస్సెమ్మెస్ లాంటి ఇతర ప్రయోజనాలు ఉండవు. ఈ ప్లాన్ పనిచేయాలంటే మొదట మీకు బేస్ ప్లాన్ ఉండాలి.

ఈ ప్లాన్ ద్వారా 3 నెలల కాలపరిమితి కలిగిన రూ.149 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. ఇందులో మొత్తం 8 జీబీ డేటా లభిస్తుంది. ఈ మొత్తం వాడేసుకున్నాక స్పీడ్ 64 కేబీపీఎస్‌కు పడిపోతుంది.

రూ.333 ప్లాన్: 

దీని వ్యాలిడిటీ 28 రోజులు. అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లతోపాటు రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. అలాగే 3 నెలలపాటు డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఉంటుంది.

దీంతోపాటు జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ వంటి వాటిని కూడా ఉచితంగా యాక్సెస్ చేయొచ్చు.

రూ.583 ప్లాన్:

దీని వ్యాలిడిటీ 56 రోజులు. అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లతోపాటు రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. మొత్తంగా 84 జీబీ డేటా లభిస్తుంది.

ఇందులో కూడా 3 నెలల కాలపరిమితితో కూడిన డీస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. ఇంకా జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ వంటి యాప్స్‌ను కూడా ఉచితంగా యాక్సెస్ చేయొచ్చు.

రూ.783 ప్లాన్:

దీని వ్యాలిడిటీ 84 రోజులు. ప్రయోజనాలు కూడా రూ.583 ప్లాన్‌లో ఉన్న మాదిరిగానే ఉంటాయి. అయితే అదనంగా కలిగే ప్రయోజనం ఏమిటంటే.. 3 నెలలపాటు మీ మొబైల్‌లో ఉచితంగా డిస్నీ+ హాట్‌స్టార్ కార్యక్రమాలను వీక్షించవచ్చు.

 

 

- Advertisement -