
ముంబై: కరోనా లాక్‌డౌన్ వేళ.. ఇంట్లోంచి బయటికి రాలేక, థియేటర్లు మూతబడడంతో కొత్త సినిమాలు చూడలేక మొహం వాచిపోయి ఉన్న వారి కరువు తీర్చేలా ఓ కొత్త సినిమా వచ్చేసింది. ఇది మామూలు సినిమా కాదు. నార్త్, సౌత్ అగ్రస్థాయి కథానాయకులందరూ కలిసి నటించిన మల్టీస్టారర్ సినిమా.
చదవండి: వైద్యులకు తన ‘కూలీ’ పాటను అంకితమిచ్చిన అమితాబ్ బచ్చన్
కాకపోతే ఇది వెండితెర మీద చూసేది కాదు. షార్ట్ ఫిల్మ్.. అంటే యూట్యూబ్‌లో చూసేయొచ్చు. ఈ సినిమా పేరు ‘ఫ్యామిలీ’. ఇందులో స్టారాధిస్టారులు నటించారు. అమితాబ్ బచ్చన్, చిరంజీవి, రజినీకాంత్, మోహన్‌లాల్, మమ్మూట్టి, శివరాజ్‌కుమార్, రణ్‌బీర్ కపూర్, ప్రియాంక చోప్రా, ఆలియా భట్ తదితరులు నటించారు.
వీరితోపాటుగా పంజాబీ నటుడు దిల్జిత్ దొసాంజ్, బెంగాలీ నటులు ప్రొసెన్‌జిత్ ఛటర్జీ, సోనాలీ కులకర్ణి కూడా ఈ లఘుచిత్రంలో నటించారు. కరోనా వైరస్ లోకాన్ని ఏలుతున్న వేళ.. ఎవరూ బయటికి వెళ్లకండి.. అందరూ ఇంట్లోనే ఉండండి అనే సందేశం చెప్పేందుకు ఈ చిత్రాన్ని రూపొందించారు.
కథంతా అమితాబ్ కళ్లజోడు చుట్టూ…
ఈ సినిమా చిత్రీకరణ నటీనటులందరి ఇళ్లలోనే జరిగడం విశేషం. కథ విషయానికొస్తే.. అమితాబ్ కూలింగ్ గ్లాసెస్ కనిపించవు. దీంతో వాటి గురించి రణ్‌బీర్ కపూర్, దిల్జిత్ దొసాంజ్ అదే ఇంట్లో ఉన్న మిగిలిన నటులను అడుగుతుంటారు. ఈ క్రమంలో వారు చెప్పే సమాధానాలతో చిత్రం ఆద్యంతం ఆసక్తిగా సాగుతుంది.
చదవండి: కోవిడ్-19 ఎఫెక్ట్: ‘ఆరోగ్య సేతు’ యాప్‌ను లాంచ్ చేసిన కేంద్రం…
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తనదైన స్టయిల్లో కూలింగ్ గ్లాసెస్‌తో చేసే విన్యాసం, మెగాస్టార్ చిరంజీవి బాత్రూంలో గడ్డం గీసుకుంటూ చెప్పే డైలాగ్ అదుర్స్ అనే చెప్పాలి. విశేషం ఏమిటంటే.. ఇందులో మన సౌత్ యాక్టర్స్ అందరూ వారి వారి భాషల్లోనే సంభాషణలు చెప్పడం.
కొసమెరుపు ఏమిటంటే…
మొత్తానికి ఈ లఘు చిత్రం చివరలో అమితాబ్ కూలింగ్ గ్లాసెస్ దొరుకుతాయి. అయితే కరోనా లాక్‌డౌన్ కారణంగా కొన్నాళ్లపాటు తాను బయటికెళ్లే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు వాటి అవసరం లేదంటూ అమితాబ్ చెప్పడం ఈ చిత్రానికి కొసమెరుపు. అంతేకాదు, చివరలో మీరూ ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా కరోనా వైరస్ నుంచి సురక్షితంగా ఉండమంటూ ప్రజలకు సందేశం ఇస్తారు.
భారతీయ సినీ పరిశ్రమ ఒక ‘ఫ్యామిలీ’…
ప్రసూన్ పాండే తెరకెక్కించిన ఈ చిత్రంలో స్టారాధిస్టారులందరూ తమ ఇళ్లలోనే ఉండి తమ పాత్ర ప్రకారం నటించగా.. వాటన్నింటినీ కలిపి ఈ లఘుచిత్రం తయారు చేశారు.
అంతేకాదు, భారతీయ సినీ పరిశ్రమ అంతా ఒకటే ఫ్యామిలీ అని, లాక్‌డౌన్ నేపథ్యంలో సినీ పరిశ్రమకు చెందిన వివిధ భాగాల కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, వారి సంక్షేమం కోసం తాము నిధులు సేకరిస్తున్నామని, అందులో భాగంగానే ఈ లఘుచిత్రం తీశామని అమితాబ్ ఈ వీడియోలో చెబుతారు.
Presenting ‘Family’, a made-at-home short film featuring @SrBachchan, #Rajnikanth #RanbirKapoor @priyankachopra @aliaa08, #Chiranjeevi @Mohanlal, #Mammootty, @meSonalee @prosenjitbumba #ShivaRajkumar & @diljitdosanjh.
Supported by #SonyPicturesNetworksIndia & #KalyanJewellers. pic.twitter.com/menuDz808H— sonytv (@SonyTV) April 6, 2020








