సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న ఐశ్వర్యారాయ్ లీక్డ్ వీడియో.. చూస్తే కళ్లు తిప్పుకోలేరు మరి!

- Advertisement -

ముంబై: మాజీ ప్రపంచ సుందరి, అందానికి మారుపేరైన ఐశ్వర్యారాయ్‌కి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. నెట్టింట్లో హల్‌చల్ చేస్తోన్న ఈ సాంగ్ వీడియో ‘రాధేశ్యామ్ సీతారామ్’ అనే హిందీ చిత్రం లోనిది. ఆశ్చర్యం ఏమిటంటే.. 1997 నాటి ఈ చిత్రం ఇప్పటి వరకు విడుదల కాకపోవడం.

చదవండి: షూటింగ్ కోసం వెళ్లి ఎడారిలో చిక్కుకున్న హీరో.. రక్షించమంటూ వేడుకోలు

తాజాగా ఈ చిత్రంలో ఐశ్వర్య ఓ పాటకు నర్తిస్తోన్న వీడియో వెలుగులోకి వచ్చింది. 23 ఏళ్ల నాటి ఈ వీడియోలో ఐశ్వర్యారాయ్ సంప్రదాయ వస్త్రధారణలో అందాల దేవతలా మెరిసిపోతోంది. ఆ పాటలో ఆమె నృత్య భంగిమలు ప్రేక్షకుల మతిపోగొట్టే విధంగా ఉన్నాయి. 

1997లో బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనీస్ బాజ్మీ దర్శకత్వంలో చిత్రీకరణ జరుపుకొన్న రాధేశ్యామ్ సీతారామ్ అనే ఈ చిత్రంలో ఐశ్వర్యారాయ్ ప్రధాన పాత్రలో నటించింది. అయితే కారణాలు ఏవైనప్పటికీ ఈ చిత్రం ఇప్పటి వరకు విడుదల కాలేదు. ఈ చిత్రంలో సునీల్ శెట్టి, పరేష్ రావల్ తదితరులు కూడా నటించారు. 

చదవండి: జిమ్‌లో దీపిక లుంగీ డ్యాన్స్.. వీడియో వైరల్

1994లో ఐశ్వర్యారాయ్ ప్రపంచ సుందరి కిరీటం గెలుచుకున్న తరువాత సినిమా ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చింది. తన అందం, అభినయంతో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి అటు నార్త్, ఇటు సౌత్ ప్రేక్షకులను ఆమె అలరించిన సంగతి తెలిసిందే. 

తాజాగా నెట్టింటిని ఓ ఊపు ఊపేస్తోన్న ఈ వీడియోను మీరూ చూడండి.. ఐశ్వర్యకు ఫిదా అవకపోతే ఒట్టు!  

చదవండి: కరోనా లాక్‌డౌన్: అమితాబ్ ఇంట్లో మల్టీస్టారర్ చిత్రం.. పేరు ‘ఫ్యామిలీ’, ఎవరు నటించారంటే..

 

- Advertisement -