28.3 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం మా నుంచి మా వాళ్లకు సోకితే పరిస్థితి ఏంటి?.. కన్నీరు పెట్టుకున్న వైద్యురాలు

మా నుంచి మా వాళ్లకు సోకితే పరిస్థితి ఏంటి?.. కన్నీరు పెట్టుకున్న వైద్యురాలు

- Advertisement -

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ను దేశం నుంచి తరిమికొట్టేందుకు వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు విశ్రాంతి లేకుండా పోరాడుతున్నారు.

చదవండి: ఢిల్లీ సీఎం సంచలన నిర్ణయం.. కరోనా బాధితులకు వైద్యం చేస్తూ మరణిస్తే రూ.కోటి…

ఈ విపత్కర పరిస్థితుల్లో ఢిల్లీ ఎయిమ్స్‌లోని కొవిడ్‌-19 ఐసోలేషన్‌ వార్డులో పని చేస్తున్న వైద్యురాలు డాక్టర్‌ అంబికా మీడియాతో మాట్లాడుతూ.. కొవిడ్‌-19కు వ్యతిరేక పోరాటం ఓ యుద్ధం లాంటిందని అన్నారు.

ఐసోలేషన్‌ వార్డులో పని చేస్తున్నప్పుడు తమకు తెలియకుండానే రోమాలు నిక్కపొడుస్తాయని పేర్కొన్నారు. ఈ వార్డుల్లో పని చేస్తున్న తమకు, తమ నుంచి కుటుంబ సభ్యులకు కరోనా సోకితే పరిస్థితి ఏంటని ఒక్కోసారి భయమేస్తుందన్నారు.

ఒక వేళ జరగరానిది జరిగితే.. తమ కుటుంబ సభ్యులు కూడా తమను చూడటానికి రారని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తాము పని చేస్తున్నామని చెబుతూ డాక్టర్ అంబిక కన్నీరు పెట్టుకున్నారు.

- Advertisement -