నిజమేనా?: రాఖీ సావంత్ వివాహం!? ఇదిగో వెడ్డింగ్ కార్డ్, డిసెంబర్ 31న, వరుడు ఎవరంటే…

- Advertisement -

rakhi-savant-marriage

ముంబై: ఐటమ్ సాంగ్స్‌లో అధికంగా నటించే రాఖీ సావంత్‌.. అందరికీ సుపరిచితమే. నటన, డ్యాన్సులకంటే కూడా ఎక్కువ‌గా వివాదాల‌తో తరచూ ఈ ఐటమ్ బాంబ్ అంద‌రి దృష్టిలో ప‌డుతూంటుంది. ఈ మధ్య ‘#మీటూ’ ఉద్య‌మంలో భాగంగా బాలీవుడ్ నటుడు నానా పాటేకర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నటి త‌ను శ్రీ ద‌త్తా మీద సంచ‌ల‌న కామెంట్స్ చేయడం ద్వారా రాఖీ సావంత్ మళ్లీ వెలుగులోకి వచ్చింది.

ఆ త‌ర్వాత హర్యానాలోని పంచకులలో జరిగిన కాంటినెంటల్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్(సీడబ్ల్యూఈ) పోటీ సందర్భంగా జరిగిన ఘటనతో మ‌రో సారి వార్త‌ల‌లోకి వ‌చ్చిన ఈ ముద్దుగుమ్మ తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఈసారి తాను పెళ్లి చేసుకోబోతున్నానంటూ బాంబు పేల్చింది. ఇంతకీ ఇది నిజమేనా? అన్న సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్న వారందరికీ తన వెడ్డింగ్ కార్డును షేర్ చేయడం ద్వారా రాఖీ సావంత్ మరింత క్లారిటీ కూడా ఇచ్చేసింది.

వరుడు.. దీపక్ కలాల్!

‘ఇండియా గాట్ టాలెంట్’ యాక్ట‌ర్ దీప‌క్ క‌లాల్‌ని వచ్చే డిసెంబ‌ర్ 31 సాయంత్రం 5: 55 నిమిషాలకు లాస్‌ ఏంజెల్స్‌లో రాఖీ సావంత్ వివాహం చేసుకోబోతోంది. ఈ మేరకు త‌న వెడ్డింగ్ కార్డ్‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన రాఖీ సావంత్ .. ‘‘మేం ఒక్క‌ట‌వ్వాల‌నుకుంటున్నాం.. ఇండస్ట్రీలో చాలామంది ఒక్కటవుతున్నారు. ఇదే రైట్‌ టైమ్‌ అనిపించింది. అందరి ఆశీర్వాదం మాకు కావాలి..’’ అంటూ పేర్కొంది.

గ‌తంలో ప‌బ్లిసిటీ స్టంట్‌గా ఇలాంటి ప‌నులు చాలా చేసిన రాఖీ సావంత్ ఈసారి నిజంగానే పెళ్లి పీటలు ఎక్కబోతోంది. బాలీవుడ్‌లో దీపికా-ర‌ణ్‌వీర్ వివాహం త‌ర్వాత ప్రియాంక‌- నిక్ జోన‌స్‌ల వివాహం జ‌ర‌గ‌నుండ‌గా, ఆ త‌ర్వాత డిసెంబ‌ర్ 13న శ్వేతాబసు ప్రసాద్‌ తన బాయ్‌ఫ్రెండ్, దర్శకుడు అయిన రోహిత్‌ మిట్టల్‌ని పెళ్లి చేసుకోనుంది.

ఇప్పుడు ఈ లిస్టులోకి రాఖీ సావంత్ కూడా ఎక్కేసింది. ఇలా బాలీవుడ్ భామలంతా వరుసకట్టి పెళ్లిపీటలు ఎక్కుతుండడంతో.. చూస్తుంటే బాలీవుడ్‌కి పెళ్ళిక‌ళ వ‌చ్చేసింద‌ని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

 

View this post on Instagram

 

Please everyone have to come shadi ke leeye don’t bring anye gifts ? please

A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on

- Advertisement -