26.4 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home ఏపీ అసెంబ్లీ ఎన్నికలు 2019 రీ పోలింగ్ కేంద్రాల్లో అప్పుడే ప్రలోభాలు మొదలయ్యాయా?

రీ పోలింగ్ కేంద్రాల్లో అప్పుడే ప్రలోభాలు మొదలయ్యాయా?

- Advertisement -

అమరావతి: ఏపీలో ఈనెల 6వ తేదీన ఐదు చోట్ల రీపోలింగ్‌ నిర్వహిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ పరిధిలోని కేసనపల్లిలోని 94వ నెంబర్ పోలింగ్‌ బూత్, పశ్చిమ నియోజకవర్గం నల్లచెరువులోని 244వ పోలింగ్‌ బూత్, నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం పల్లెపాలెంలోని ఇసుకపల్లిలో 41వ పోలింగ్‌ బూత్, సూళ్లూరుపేట నియోజకవర్గం అటకానితిప్పలోని 197వ పోలింగ్‌ బూత్, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ పరిధి కలనూతలలోని 247వ పోలింగ్‌ బూత్‌లో రీపోలింగ్ జరగనుంది.

అయితే ఎన్నికల సంఘం ఇలా ప్రకటన చేసిందో లేదో… అప్పుడే పార్టీలు ఓటర్లని ప్రలోభాలకు గురిచేసేందుకు సిద్ధమయ్యారట. టీడీపీ-వైసీపీల మధ్య హోరాహోరీ పోరు నడవడంతో అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకునేందుకు వారు సిద్ధంగా లేరు. ఎలా అయిన ఎన్నికల్లో గెలిచే తీరేందుకు ఓటుకు రేటు కడుతున్నారు.

మే 6న జరిగే రీపోలింగ్ లో రూ. 8,000 నుంచి రూ. 10,000 వెచ్చించడానికి వెనుకాడటం లేదని సమాచారం. ఈ రీపోలింగ్ జరిగే స్థానాల్లో టీడీపీ, వైసీపీ అభ్యర్థులు మధ్య తీవ్రపోటీ నెలకొని ఉంది. దీంతో ఈ నియోజకవర్గాల్లో రూ. 10,000 ఇవ్వడానికి కూడా అభ్యర్థులు సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది.

చదవండి: జనసేనకి 5 ఎంపీ సీట్లు వస్తాయటా….!

- Advertisement -