అమరావతి: టీడీపీ యువ నాయకురాలు సాధినేని యామినిపై వైసీపీ నేత సుధాకర్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలోని వైసీపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి నిర్వహించే ఏ మీడియా సమావేశానికైనా లోకేశ్ కోసం యామిని వస్తుందట అని వెటకారంగా మాట్లాడారు.
అసలు ఆ యామినికి ఈ లోకేశ్ కు ఉన్న సంబంధం ఏమిటి? ఆయన ప్రశించారు. అలాగే ఈమె ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకిలా పేట్రేగి మాట్లాడుతుందో? చిన్నవయసులోనే ఇంత అహంకారం ఎక్కడి నుంచి వచ్చిందో అంటూ ఫైర్ అయ్యారు. ఆమె కన్నుమిన్నూ కానకుండా, పెద్దా చిన్నా లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు.
అలాగే యనమల రామకృష్ణుడుకి బదులుగా కుటుంబరావు మీడియా ముందుకు వస్తారని, ఇక చంద్రబాబు సమాధానం చెప్పాల్సి వస్తే మరి ఎవరొస్తారో తెలియడం లేదని ఆయన విమర్శించారు. ఎన్నికల ఫలితాల్లో చంద్రబాబుకు ఘోర ఓటమి తప్పదని, ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి జగన్ అని జోస్యం చెప్పారు. అసలు కాబోయే సీఎంపై టీడీపీ నాయకులు ఎలా విమర్శలు చేశారంటూ సుధాకర్ మాట్లాడారు.
చదవండి:మంగళగిరిలో లోకేష్ ఓటమి తథ్యం! ఆస్థాన మీడియా తాజా సర్వేలోవెల్లడి!








