అందరి చూపు లగడపాటి సర్వే పైనే…

- Advertisement -

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. ఆదివారం తుది దశ ఎన్నికలు జరగనున్నాయి. ఇక సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా మే 23న విడుదల అవుతాయి. అయితే ఫలితాల కంటే ముందుగా రేపు సాయంత్రం 5 గంటల నుంచి ఎక్జిట్ పోల్స్ హడావిడి మొదలవుతుంది.

వీటిల్లో ఏ సర్వే ఎలా ఉన్న అందరి చూపు మాత్రం ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ ఇచ్చే సర్వే పైనే ఉంది. ఎన్నో ఏళ్లుగా ఎన్నికల సర్వేలు ఇవ్వడంలో ఆరితేరిన లగడపాటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై తన సర్వేని రేపు సాయంత్రం 7 గంటలకు వెలువరించనున్నారు.

చదవండి: ఆ 19 చోట్ల రీపోలింగ్ పెట్టాల్సిందే! సిఎస్ ని డిమాండ్ చేసిన టీడీపీ మంత్రులు!

అయితే ఎప్పుడూ ఖచ్చితత్వం ఉండే లగడపాటి సర్వే ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా విఫలమైన విషయం తెల్సిందే.  ఆ ఎన్నికల్లో ప్రజాకూటమికే ప్రజలు పట్టం కట్టారనీ, ప్రభుత్వ వ్యతిరేకత వల్లే ఓటింగ్ శాతం పెరిగిందనీ చెప్పారు. తీరా చూస్తే, వాస్తవ ఫలితాలు అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. ప్రజలు టీఆర్ఎస్‌ని గెలిపించారు.

ఈ క్రమంలోనే లగడపాటి సర్వే ఏపీ ఎన్నికలపై ఎలా ఉంటుంది. ఆయన సర్వే ఎవరికి అనుకూలంగా ఉంటుంది. అసలు ఆయన సర్వే నిజం అవుతుందా అనే ప్రశ్నలు అందరి మనసులో ఉన్నాయి.

ఏపీ ఎన్నికలపై జాగ్రత్తగా సర్వే…

ఇక తెలంగాణ ఎన్నికల ఫలితాల్ని తప్పుగా చెప్పి, తన క్రెడిబులిటీని దెబ్బతీసుకున్న లగడపాటి… ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై మాత్రం అత్యంత జాగ్రత్తగా సర్వే చేయించారని తెలుస్తోంది.

ఈ ఎన్నికల్లో రాజగోపాల్ టీం… దాదాపు 5 సార్లు సర్వే చేసినట్లు తెలిసింది. ఎన్నికలకు ఏడాది ముందు నుంచే ఈ సర్వే మొదలైనట్లు తెలుస్తోంది. ఎన్నికలు ముగిశాక కూడా ఈ సర్వే జరిపించారని తెలుస్తోంది. అన్నీ రకాలుగా ప్రజల దగ్గర నుంచి అభిప్రాయాన్ని జాగ్రత్తగా తెలుసుకున్నారు. మరి చూడాలి లగడపాటి సర్వే ఎలా ఉంటుంది…ఎవరికి అనుకూలంగా ఉంటుందో.

చదవండిఎగ్టిట్ పోల్స్…ఎవరికీ షాక్ ఇవ్వబోతున్నాయో చూడండి!
- Advertisement -