చంద్రగిరిలో రీపోలింగ్‌పై హైకోర్టులో పిటిషన్ వేసిన టీడీపీ !

AP_High_Court
- Advertisement -

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పుడూ లేని విధంగా తొలి దశలోనే ఏప్రిల్ 11న పోలింగ్ నిర్వహించారు. అయితే, పోలింగ్ జరిగిన 35 రోజుల అనంతరం చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు కేంద్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో ఈసీ తీరుపై అధికార టీడీపీ మండిపడుతోంది.

తాము రీపోలింగ్‌కు డిమాండ్ చేసినా పట్టించుకోవడంలేదని, అదే వైసీపీ ఏదైనా ఫిర్యాదు చేస్తే ఆగమేఘాల మీద స్పందిస్తోందని టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది. తాజాగా, ని చంద్రగిరిలో రీపోలింగ్‌ విషయంపై టీడీపీ హైకోర్టులో శుక్రవారం అత్యవసర వ్యాజ్యం దాఖలుచేసింది. టీడీపీ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది.

చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలంలోని మూడు పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ జరపాలని ఈసీకి ఫిర్యాదు చేసినట్లు హైకోర్టుకు ఫిటిషనర్‌ తరఫు న్యాయవాది తెలియజేశారు. దీనిని పరగణనలోకి తీసుకున్న హైకోర్టు, పిటిషనర్‌ ఫిర్యాదుపై ఏం నిర్ణయం తీసుకున్నారో తెలపాలని ఈసీని ఆదేశించింది.

ఈ సందర్భంగా ఈసీ తరఫున న్యాయవాది మాట్లాడుతూ.. ఈ వ్యాజ్యం విచారించేందుకు హైకోర్టుకు అర్హతలేదని వాదించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం, అర్హతపై పూర్తి వివరాలతో అఫిడ్‌విట్ దాఖలు చేయాలని ఈసీని ఆదేశించింది. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం విచారణను శనివారానికి వాయిదా వేసింది.

- Advertisement -