30.2 C
Hyderabad
Saturday, November 7, 2026
- Advertisement -
Home క్రైమ్ దారుణం: కూతురిపై తండ్రి, బాబాయ్‌లే.. మూడేళ్లుగా అదే తంతు.. తెలిసినా మిన్నకుండిపోయిన తల్లి!

దారుణం: కూతురిపై తండ్రి, బాబాయ్‌లే.. మూడేళ్లుగా అదే తంతు.. తెలిసినా మిన్నకుండిపోయిన తల్లి!

father-raped-his-own-daughter
- Advertisement -

father-raped-his-own-daughter

చెన్నై: కామంతో కళ్లుమూసుకుపోయిన ఓ తండ్రి కన్న కూతురిపైనే అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ విషయం ఆ బాలిక బాబాయ్‌లకు తెలిసింది. వారు అన్నను చితకబాదాల్సింది పోయి, అదే అదనుగా అతడ్ని బెదిరించి వారు కూడా ఆ బాలికపై అత్యాచారం చేస్తున్నారు.

మూడేళ్లుగా సాగుతున్న ఈ తంతు ఇటీవల బయటికొచ్చింది. వారు సాగిస్తోన్న దారుణకాండ ఆ బాలిక తల్లికి తెలిసినా.. ఎవరికైనా చెబితే కూతుర్ని చంపేస్తారేమో అన్న భయంతో ఆమె మిన్నకుండిపోయింది.

దారుణం: ఇంజనీరింగ్ విద్యార్థినిపై అన్నయ్య స్నేహితుడే.. మరో ఐదుగురితో కలిసి రెండ్రోజులపాటు…

ఈ దారుణం తాజాగా వెలుగు చూడడంతో పోలీసులు నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి. జనవరి 5న కోయంబత్తూరులోని తెలుంగపాళ్యం ప్రభుత్వ పాఠశాలలో లైంగిక వేధింపుల విషయంపై విద్యార్థినులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

అధికారుల రాకతో వెలుగులోకి…

జిల్లా బాలల సంక్షేమ శాఖ, కలెక్టర్ కార్యాలయం అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో అక్కడ ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని తనపై జరుగుతోన్న లైంగిక దోపిడీ గురించి వెల్లడించింది. ఇందులో తన తండ్రి, బాబాయ్‌లే నిందితులని, 2015 నుంచి వారు తనపై అత్యాచారానికి పాల్పడుతున్నారని వాపోయింది. బాలిక చెప్పిన విషయం విని దిగ్భ్రాంతికి గురైన అధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు. ఆమెను బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు.

సదరు బాలికపై ఆమె తండ్రి 2015 నుంచి అత్యాచారానికి పాల్పడుతున్నాడని, ఈ విషయం అతడి సోదరులకు తెలియడంతో వారు కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడుతూ తమ లైంగిక వాంఛలను తీర్చుకుంటున్నారని అధికారులుతెలిపారు. ఆ బాలిక బాబాయ్‌లకు వివాహం అయింది.. పిల్లలు కూడా ఉన్నారు.

విచిత్రం ఏమిటంటే.. తన కూతురిపై జరుగుతున్న అఘాయిత్యం గురించి ఆ బాలిక తల్లికి తెలిసినా ఆమె మిన్నకుండిపోయింది. పోలీసుల వద్దకు పోతే ఎక్కడ తన కుమార్తె ప్రాణానికే ప్రమాదం తీసుకొస్తారోనని ఆమె భయపడింది.

అయితే అధికారులు మాత్రం ఈ విషయం తెలియగానే సెల్వపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో బాధితురాలి తండ్రి, ఇద్దరు బాబాయ్‌లు చేసిన దారుణం వెల్లడైంది. స్థానికంగా బండిపై వేరుశెనక్కాయలు అమ్ముకుంటోన్న బాలిక తండ్రి (35), బాబాయ్ (28)ను పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో బాబాయ్ (23) కోసం గాలిస్తున్నారు. నిందితులపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 

- Advertisement -