ఇండోనేషియాలో సంభవించిన సునామీ పెను విషాదాన్ని తీసుకువచ్చింది. శుక్రవారం (సెప్టెంబర్ 28) ‘సులవెసి’ ద్వీపంలో చోటుచేసుకున్న భారీ భూకంపం, తర్వాత సంభవించిన సునామీ కారణంగా దాదాపు 384 మంది వరకు మృత్యువాతపడ్డారు. వందలాది మంది గాయపాలు అయ్యరు. ‘పలూ’ నగర తీరంపై సునామీ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది, ఇక్కడ ఐదు అడుగుల ఎత్తులో రాకాసి అలలు ఎగసిపడ్డాయి. సునామీ కారణంగా ‘పలూ’ నగరం తీవ్రంగా దెబ్బతింది. నగర తీరం వెంబడి మృతదేహాలతో నిండిపోయింది.
సునామీ బారిన పడి తీవ్రంగా గాయపడినవారితో నగరంలో ఆస్పత్రులు అన్ని నిండిపోయాయి. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. పలూలో 3,50,000 మందికి పైగా జనాభా ఉన్నట్లు పలూ అధికారులు తెలిపారు.
ఈ శనివారం ఉదయం ‘పలూ’ సముద్ర తీరంలో చాలా మృతదేహాలను గుర్తించారు. భవనాలు కుప్పకూలిన ప్రాంతాల్లో శిథిలాల కింద కొన్ని మృతదేహాలను బయటకితీశారు. శిథిలాల కింద చిక్కుకొని చాలా మంది గాయపడ్డారు. వారందరినీ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు