సంగారెడ్డి: తెలంగాణ మంత్రి హరీష్‌రావుకు ప్రమాదం తప్పింది. సంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశానికి ఈ రోజు (శనివారం) మంత్రి హరీష్‌రావు హాజరయ్యారు.
హరీష్‌రావు రాకతో అక్కడి కార్యకర్తలు భారీ ఎత్తను బాణాసంచా పేల్చరు, దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భయపడిన కార్యకర్తలు చెల్లాచెదురయ్యారు. ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా పొగలు చూట్టముట్టడంతో మంత్రి హరీష్‌రావు అందులో చిక్కుకుపోయారు.
వెంటనే అప్రమత్తమైన హరీష్‌రావు భద్రతా సిబ్బంది మంత్రిని అక్కడిని సురక్షితమైన ప్రాంతానికి తీసుకు వెళ్ళాడంలో పెను ప్రమాదం తప్పింది.
ఈ ఘటనపై మంత్రి హరీష్‌రావు ట్వీట్ చేశారు…..
సంగారెడ్డి ఎన్నికల ప్రచారం ర్యాలీలో నాకు ఎటువంటి ప్రమాధం జరుగలేదు. నేను క్షేమంగానే ఉన్నా .. మిత్రులెవరూ ఆందోళన చెందవద్దు..
మీ అభిమానానికి ధన్యవాదాలు— Harish Rao Thanneeru (@trsharish) September 29, 2018