- Advertisement -
హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాబు మోహన్ టీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరనున్నారు. అసెంబ్లీ రద్దు తర్వాత 105 మంది అభ్యర్థులతో భారీ జాబితాను ప్రకటించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్… అందోల్ సిట్టింగ్ ఎమ్మెల్యే బాబుమోహన్‌ను పక్కన పెట్టి, ఆ టికెట్ జర్నలిస్టు క్రాంతి కిరణ్‌కు కేటాయించారు.
ఈ నేపథ్యంలో తనకు టికెట్ దక్కకపోవడంతో తీవ్ర మనస్థాపం చెందిన బాబుమోహన్ బీజేపీలో చేరనున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగా శనివారం ఆయన బీజేపీ తెలంగాణ చీఫ్ లక్ష్మణ్‌తో కలిసి ఢిల్లీ వెళ్లారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో బాబుమోహన్ బీజేపీలో చేరనున్నట్లు సమాచారం.
- Advertisement -