పెళ్లిపీటలెక్కబోతున్న మరో ప్రేమజంట!

arya marriage invitetion sayesha
- Advertisement -

మార్చిలో పెళ్లి చేసుకోవోతున్నామంటూ మరో ప్రేమజంట ప్రేమికుల దినోత్సవం నాడు అధికారికంగా ప్రకటించేసింది. ఆర్య, సాయేషా ప్రేమ వ్యవహారంపై కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిద్దరూ మార్చిలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వినిపించాయి.

అయితే అది నిజమేనంటూ ఆర్య గురువారం అధికారికంగా ప్రకటించేశాడు. వాలెంటైన్స్ డే సందర్భంగా తామిద్దరం మార్చిలో ఒక్కటి కాబోతున్నామంటూ ఆర్య ఓ అందమైన కార్డు ద్వారా తెలిపాడు. మా తల్లిదండ్రులు, కుటుంబం, అలాడే మీ అందరి దీవెనలతో మేము మా జీవితంలో ఓ అందమైన రోజును షేర్ చేసుకోవాలనుకుంటున్నాం.

మేము మార్చి నెలలో వివాహం చేసుకోబోతున్నాం. మేమిద్దరం కొత్త ప్రయాణాన్ని సాగించేందుకు ఒక్కటవుతున్న సందర్భంగా మీ ప్రేమ, దీవెనలు కోరుకుంటున్నాం అని ఆర్య ట్వీట్ చేశాడు.సాయేషా అఖిల్ అక్కినేని అఖిల్ చిత్రం ద్వారా తెలుగు తెరకి పరిచమైంది.

- Advertisement -