34.1 C
Hyderabad
Monday, October 12, 2026
- Advertisement -
Home అవీ-ఇవీ Nayan-Vignesh Marriage: అంగరంగ వైభవంగా నయనతార-విఘ్నేశ్ శివన్ వివాహం…

Nayan-Vignesh Marriage: అంగరంగ వైభవంగా నయనతార-విఘ్నేశ్ శివన్ వివాహం…

- Advertisement -

చెన్నై: అనుకున్నట్లుగానే సినీనటి నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. మహాబలిపురంలోని షెరిటన్ హోటల్‌లో గురువారం వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.

దాదాపు ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ చివరికి ఇరు పక్షాల కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో భార్యాభర్తలయ్యారు.

వివాహానంతరం విఘ్నేశ్ ఓ ఫొటో కూడా షేర్ చేశారు. అందులో – మంగళసూత్రధారణ అనంతరం విఘ్నేశ్ ప్రేమగా ముద్దాడగా నయన్ మురిసిపోతున్న దృశ్యమది.

అంతేకాదు – ‘‘ఆన్ ఏ స్కేల్ ఆఫ్ 10.. ఆమె తొమ్మిది, నేను ఒకటి… దేవుడు, విశ్వం, మీ అందరి ఆశీస్సులతో మేం వివాహబంధంలోకి అడుగుపెట్టాం..’’ అంటూ తన పోస్టులో విఘ్నేశ్ రాసుకొచ్చారు.

కోలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ పరిశ్రమలకు చెందిన పలువురు సినీ ప్రముఖులు ఈ వివాహ వేడుకల్లో పాల్గొనగా.. నయనతార అభిమానులు, విఘ్నేశ్ శివన్ అభిమానులు, నెటిజెన్లు నూతన జంటకు శుభాకాంక్షలు తెలిపారు.

స్పెషల్ అట్రాక్షన్…

వీరి వివాహ ఘట్టంలో స్పెషల్ అట్రాక్షన్ ఏమిటంటే.. తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ తన చేతుల మీదుగా మంగళసూత్రం అందించడం.

రజనీకాంత్ అందించిన మంగళ సూత్రాన్ని అందుకున్న విఘ్నేశ్ శివన్ తన ప్రేయసి నయనతార మెడలో మూడుముళ్ల వేయడంతో ఈ వేడుకకు హాజరైన వారంతా ఆనంద పరవశులయ్యారు.

విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించిన ‘నేను రౌడీనే’ చిత్రంలో నయనతార నటించింది. ఆ పరిచయం క్రమంగా వీరిని ప్రేమలోకి దింపగా.. దాదాపు ఏడేళ్ల అనంతరం ఇద్దరినీ ఒక్కటి చేసింది.

 

 

- Advertisement -