Upasana: ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష మరణంపై.. ఎమోషనల్ అయిన ఉపాసన!

- Advertisement -

హైదరాబాద్: నగరానికి చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ఫ్రత్యూష గరిమెళ్ల మృతిపై.. మెగా కోడలు ఉపాసన కొణిదెల ఎమోషనల్ అయ్యారు.

ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ఉపాసన.. ఈ వార్త తనను ఎంతగానో కలచి వేసిందని, ఎంతో బాధకు గురైనట్లు సోషల్ మీడియా ద్వారా తన మనోభావాలను పంచుకున్నారు.

తమ వివాహ పదో వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు రామ్‌చరణ్-ఉపాసన దంపతులు ఇటీవల విదేశాలకు వెళ్లారు. ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూషతో ఉపాసనకు ఎంతో కాలంగా స్నేహం ఉంది.

ప్రత్యూష గరిమెళ్ల.. ఉపాసనకు కూడా వ్యక్తిగత డిజైనర్‌గా వ్యవహరించారు. ఉపాసన కోసం ఆమె ప్రత్యేకమైన డ్రెస్‌లు డిజైన్ చేసేవారు.

కాగా, ప్రత్యూష ఆత్మహత్య విషయం శనివారం సాయంత్రం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫారిన్ ట్రిప్‌లో ఉన్న ఉపాసన స్పందించారు.

తన స్నేహితురాలి మృతిపై విచారం వ్యక్తం చేస్తూ ట్విట్టర్‌లో ఒక పోస్టు పెట్టారు. ‘‘మై బెస్టీ.. డియర్ ఫ్రెండ్ అని సంభోదిస్తూ.. ఇంత త్వరగా నువ్వు మమ్మల్ని వదిలి వెళ్లిపోతావని అనుకోలేదు..’’ అంటూ ఉపాసన ఎమోషనల్ అయ్యారు.

కోపం, బాధగా ఉంది. మంచి ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కెరీర్ ఉన్నప్పటికీ ప్రత్యూష మానసిక కుంగుబాటుకు గురవడం విచారకరమని వ్యాఖ్యానించారు.

ఈ ఘటన తరువాత ప్రతి ఒక్కరినీ కర్మ ఫలం వెంటాడుతుందని భావిస్తున్నానని, ప్రత్యూష ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని తన పోస్టులో పేర్కొన్నారు.

- Advertisement -