హైదరాబాద్: ‘విరాట పర్వం’ చిత్రం ట్రైలర్ యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. రానా, సాయిపల్లవి జంటగా నటించిన ఈ చిత్రం ట్రైలర్‌ని ఇటీవలే కర్నూలులో విడుదల చేశారు.
నక్సలిజం బ్యాక్ డ్రాప్‌లో వేణు ఊడుగుల దర్శకత్వంలో ‘విరాటపర్వం’ చిత్రం తెరకెక్కింది. సుధాకర్ చెరుకూరి ఈ చిత్రానికి నిర్మాత కాగా.. సురేష్ బొబ్బిలి సంగీత దర్శకుడు.
ఈ చిత్రం ట్రైలర్ యూట్యూబ్ వీక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఎస్‌ఎల్‌వి సినిమాస్ యూట్యూబ్ ఛానల్‌లో 6 మిలియన్ల వ్యూస్ దాటగా, సురేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్‌లో మరో 4 మిలియన్లు.. అంటే మొత్తంగా 10 మిలియన్లకుపైగా డిజిటల్ వ్యూస్ తో ‘విరాట పర్వం’ ట్రైలర్ యూట్యూబ్‌లో దూసుకుపోతోంది.
నటనలో చెలరేగిపోయిన రానా, సాయి పల్లవి…
‘నీది నాది ఒకే కథ’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు వేణు ఊడుగుల ‘విరాట పర్వం’ కథని మరింత బలంగా రాసుకున్నారు.
ఈ చిత్రంలో రానా, సాయి పల్లవితో పాటు నివేదా పేతురాజ్, ప్రియమణి, నవీన్ చంద్ర, నందిత దాస్ కీలక పాత్రల్లో నటించారు. ఇక రానా నటుడిగా తానేంటో ఇప్పటికే నిరూపించుకున్నాడు. సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
వీరిద్దరూ కలిస్తే ఎలా ఉంటుందో ‘విరాట పర్వం’ ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. కథకు తగ్గట్టు రానా, సాయి పల్లవి ఎవరికి వారు నటనలో చెలరేగిపోయారని చెప్పొచ్చు.