Actress Pranitha: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ప్రణీత.. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్

- Advertisement -

బెంగళూరు: నటి ప్రణీత శుక్రవారం సాయంత్రం పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫొటోలు షేర్ చేయడం ద్వారా ఈ విషయాన్ని తనే వెల్లడిస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు.

‘పోక్రి’ అనే కన్నడ సినిమాతో తెరంగేట్రం చేసిన ప్రణీత.. ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత ‘బావ’, ‘అత్తారింటికి దారేది’, ‘రభస’ తదితర చిత్రాల్లో తన అందంతో, నటనతో మెరిసారు.

గత ఏడాది మే నెలలో వ్యాపారవేత్త నితిన్ రాజును ప్రణీత వివాహమాడారు. కరోనా లాక్‌డౌన్ సమయంలో ఎంతో మందికి సాయం చేసి తన మంచి మనసును కూడా చాటుకున్నారు.

ఆడపిల్లను ప్రసవించిన అనంతరం ‘‘మా అమ్మ గైనకాలజిస్ట్ అవడం నా అదృష్టం. ఎంతో అనుభవం ఉన్నప్పటికీ సొంత కూతురి ప్రసవం విషయంలో మాత్రం ఆమె కొంత ఎమోషనల్ అయింది..’’ అంటూ ప్రణీత వ్యాఖ్యానించారు.

తన డెలివరీ క్షేమంగా, సులువుగా అయ్యేలా చేసిన డాక్టర్ సునిల్ ఈశ్వర్, డాక్టర్ సుబ్బు, వారి బ‌ృందానికి తన పోస్టులో థాంక్స్ చెబుతూ.. పొత్తిళ్లలో ఉన్న బిడ్డ ఫొటోను షేర్ చేశారు.

- Advertisement -