27.2 C
Hyderabad
Thursday, November 5, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ టీడీపీకి అవంతి శ్రీనివాస్ గుడ్ బై: నేడే జగన్మోహన్ రెడ్డితో భేటీ!

టీడీపీకి అవంతి శ్రీనివాస్ గుడ్ బై: నేడే జగన్మోహన్ రెడ్డితో భేటీ!

ys-jagan-avanthi-srinivas
- Advertisement -

avanthi srinivas-jagan

విశాఖపట్నం: అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్‌ తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందుకు బలం చేకూరుస్తూ.. టీడీపీ నేతలకు ఆయన అందుబాటులోకి రాకపోవడం గమనార్హం.

త్వరలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి వైసీపీలో చేరుతారని సమాచారం. ప్రస్తుతం అనకాపల్లి పార్లమెంట్‌ సభ్యుడిగా ఉన్న అవంతి శ్రీనివాస్‌.. రాబోయే ఎన్నికల్లో భీమిలి అసెంబ్లీ టికెట్‌ను ఆశిస్తున్నారు.

అది కుదరని పక్షంలో విశాఖ ఉత్తరం అసెంబ్లీ స్థానాన్ని తనకు కేటాయించాలని ఆయన కోరుతున్నారు. అయితే, ఇందుకు టీడీపీ అధిష్ఠానం సుముఖత వ్యక్తం చేయలేదు. అదే సమయంలో భీమిలి టికెట్‌ ఇచ్చేందుకు వైసీపీ అంగీకరించిందని సమాచారం. దీంతో ఆయన పార్టీ మారేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది.

జగన్‌తో భేటీ తర్వాతే క్లారిటీ

ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు ఇప్పటికే ఆయనతో టచ్‌లో ఉన్నారని సమాచారం. గురువారం మధ్యాహ్నం ఆయనను ఇంటికి వెళ్లి వారు పార్టీలోకి ఆహ్వానించనున్నారని, సాయంత్రం 4 గంటలకు జగన్‌తో భేటీ అవుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, ఇటీవల టీడీపీ చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి జగన్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అవంతి రూపంలో టీడీపీకి మరో షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది.

చదవండి: వెన్నుపోటులో చంద్రబాబే సీనియర్!: ఏపీ సీంను ఏకిపారేసిన మోడీ, ‘తండ్రీకొడుకులు దిగిపోవాల్సిందే’…

 

- Advertisement -