25 C
Hyderabad
Monday, October 12, 2026
- Advertisement -
Home వార్తలు తెలంగాణ కేసీఆర్ విశాఖ పర్యటన రద్దు: ఎందుకంటే..?, సీఎం పుట్టిన రోజు నాటికి కొత్త మంత్రివర్గం!

కేసీఆర్ విశాఖ పర్యటన రద్దు: ఎందుకంటే..?, సీఎం పుట్టిన రోజు నాటికి కొత్త మంత్రివర్గం!

kcr-trs
- Advertisement -

kcr-cm

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ విశాఖపట్నం పర్యటన రద్దయింది. బడ్జెట్‌ రూపకల్పన, మంత్రివర్గ విస్తరణ సన్నాహాల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విశాఖలో శారదాపీఠం వార్షికోత్సవాలకు హాజరు కావాలని నిర్వాహకులు కేసీఆర్‌ను ఆహ్వానించిన విషయం తెలిసిందే.

అయితే, మొదట్లో హాజరయ్యేందుకు అంగీకరించిన కేసీఆర్.. తాజాగా రద్దు చేసుకున్నారు. ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణ కూర్పు, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు, లోక్‌సభ ఎన్నికల వ్యూహం సిద్ధం చేసే పనుల్లో నిమగ్నమైన నేపథ్యంలో సీఎం పర్యటన రద్దయినట్లు తెలిసింది. ఆయన తరఫున ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి శారదా పీఠం కార్యక్రమానికి హాజరు కానున్నారు.

కాగా, ఫిబ్రవరి 17 నుంచి కేంద్ర ఆర్థిక సంఘం తెలంగాణలో పర్యటించనుంది. సీఎంతో, అధికారులతో భేటీ, క్షేత్రస్థాయి పర్యటనలు జరగనున్నాయి. కీలకమైన ఈ పర్యటనను పురస్కరించుకొని సీఎం గురువారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందులో ఆర్థిక సంఘానికి ఇవ్వాల్సిన నివేదిక తయారీతోపాటు రాష్ట్ర బడ్జెట్‌ను రూపొందించే అంశంపై చర్చించనున్నారు.

పుట్టిన రోజు నాటికి కొత్త మంత్రివర్గం

మంత్రివర్గ విస్తరణపైనా సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఫిబ్రవరి 15న విస్తరణ జరుగుతుందనే ప్రచారం ఉంది. కాగా, మంత్రివర్గ విస్తరణపై గురువారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సీఎం ఉన్నతస్థాయి సమావేశం తర్వాత ఇది వెల్లడవుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కాగా, ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ పుట్టిన రోజు నాటికి కొత్త మంత్రివర్గం కొలువుదీరుతుందనే ప్రచారం కూడా జరుగుతోంది.

చదవండి: మా వాళ్లను వేధిస్తారా? భారతదేశంలోనే ఉన్నామా?: చంద్రబాబుపై తలసాని ఫైర్

- Advertisement -