
హైదరాబాద్: తన కెరీర్ ఆరంభంలో తాను ఎలాంటి కష్టాలు ఎదుర్కొనలేదని బుల్లితెర యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ చెప్పారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా ఎలాంటి షూటింగులు లేకపోవడంతో ప్రస్తుతం అనసూయ ఇంటికే పరిమితమయ్యారు.
చదవండి: సీసీసీకి కాజల్ అగర్వాల్ విరాళం.. ఎంతిచ్చిందంటే?
దీంతో తనకు సమయం కుదిరినప్పుడల్లా ఆమె తన అభిమానులతో ముచ్చటిస్తున్నారు. తాజాగా ట్విట్టర్ వేదికగా నెటిజన్లతో చాట్ చేసిన అనసూయ వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
#askAnasuya పేరుతో నిర్వహించిన ఈ ట్విట్టర్ చాట్‌లో ఓ నెటిజన్.. ‘బుల్లితెరపై యాంకరింగ్ రంగంలోకి అడుగుపెట్టే సమయంలో మీరేమైనా కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నారా? అని అడిగిన ప్రశ్నకు అనసూయ పైవిధంగా సమాధానం ఇచ్చారు.
‘‘అలాంటివి నాకు నచ్చవు..’’
‘‘మీరు ఏవైతే ఊహించుకుంటున్నారో అలాంటి కష్టాలు నేను ఎదుర్కొనలేదు. ఎందుకంటే అలాంటివి నాకు నచ్చవు. అయితే ఇప్పుడు మాత్రం ప్రతి రోజూ ఎంతో కష్టం ఎదుర్కొంటున్నాను.. అది నా అభిమానులకు, ప్రేక్షకులకు నా నుంచి కొత్తదనం ఇచ్చే విషయంలో..’’ అని అనసూయ ఆ నెటిజన్‌కు బదులిచ్చారు.
చదవండి: ప్రభుదేవా జ్ఞాపకాలను పూర్తిగా చెరిపేసుకున్న నయనతార!
మరో నెటిజన్.. ‘‘మీ మొదటి సంపాదనతో ఏం చేశారు?’’ అని అడగ్గా.. అనసూయ సమాధానమిస్తూ.. ‘‘నా తొలి సంపాదనతో మా అమ్మకు ఓ బంగారు ఉంగరాన్ని కొన్నా..’’ అన్నారు.
‘‘ఇప్పుడు మీరు ఏయే సినిమాల్లో నటిస్తున్నారు?’’ అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు.. ‘‘ప్రస్తుతం మూడు సినిమాల షూటింగ్ జరుగుతోంది. ఇంతలోనే ఈ లాక్‌డౌన్ వచ్చింది. లాక్‌డౌన్ తరువాత ఏం జరుగుతుందో, దీని ప్రభావం ఎవరిపై ఎలా ఉంటుందో ఇప్పుడైతే నాకు తెలియదు..’’ అని అనసూయ సమాధానమిచ్చింది.
Not faced such struggles which you are I assume are referring to.. ‘cos its not what I wanted to pursue.. but now.. everyday is/feels a struggle while at work.. to be a better version of myself. https://t.co/IXeJ92cvj6
— Anasuya Bharadwaj (@anusuyakhasba) April 22, 2020








