
హైదరాబాద్: ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గాంధీ అసుపత్రి కన్నా జైలు బెటర్ అని ఆయన వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకు విస్తరిస్తున్న వేళ.. అధికార పార్టీ మిత్రపక్షమైన ఎంఐఎం నేత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
చదవండి: ‘కరోనా’ అప్‌డేట్: దేశంలో 23,077 పాజిటివ్ కేసులు, 718 మంది మృతి…
గాంధీ ఆసుపత్రిలో పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయని, ఈ విషయాన్ని తనకు అక్కడ చికిత్స పొంది వచ్చిన కరోనా వైరస్ పేషెంట్లు వివరించారని తెలిపారు.
గాంధీ ఆసుపత్రిలో పేషెంట్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అక్కడ కరోనా రోగులకు ఆహారం, మందులు సక్రమంగా ఇవ్వడం లేదని వ్యాఖ్యానించారు.
పారిశుద్ధ్యం నిర్వహణ, ఇతర వసతులు కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయని, ఈ విషయాల గురించి తనకు ఎన్నో ఫిర్యాదులు అందాయని అక్బరుద్దీన్ వివరించారు.
‘‘వాటితోనే కరోనా వైరస్ బారినుంచి గట్టెక్కలేం..’’
సామాజిక దూరం, భౌతిక దూరం పాటించినంత మాత్రాన కరోనా వైరస్ బారినుంచి గట్టెక్కలేమని, పరిసరాల పరిశుభ్రత కూడా ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.
కరోనా వైరస్ బాధితులకు చికిత్స కోసం తెలంగాణలో మరిన్ని క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, సెక్రటేరియట్‌ను కూడా దీనికి వాడుకోవచ్చని అక్బరుద్దీన్ సూచించారు.
చదవండి: నేనెప్పుడూ అలాంటి కష్టాలు ఎదుర్కోలేదు.. తొలి సంపాదనతో ఏం చేశానంటే: అనసూయ
గచ్చిబౌలిలో ఉన్న స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ప్రభుత్వం కోవిడ్ స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దడంపై ఆయన హర్షం వ్యక్తం చేస్తూ.. రాష్ట్రంలో మరింత ఎక్కువగా కరోనా పరీక్షలు నిర్వహించాలని సూచించారు.
ఒకవేళ పరిస్థితి చేయిదాటి కేసుల సంఖ్య ఊహించని విధంగా పెరిగినట్లయితే ఓవైసీ గ్రూప్‌కు చెందిన ఆసుపత్రులు, వైద్యులు, నర్సులు కూడా ప్రభుత్వానికి సహకరిస్తారని, కరోనా మహమ్మారిపై పోరాడేందుకు వారంతా సిద్ధంగా ఉన్నారని తెలిపారు.








