హైదరాబాద్: సినిమా అనేది రంగుల ప్రపంచం. బయటనుండి చూడటానికి చాలాబాగుంటుంది. కానీ , లోలోపల మనకు తెలియని ఎన్నో విషయాలు జరుగుతుంటాయి. ఎంతోమంది ఈ రంగుల ప్రపంచంలో ఏమి లేకుండా ఎంట్రీ ఇచ్చి అందలం ఎక్కారు. అదే విధంగా అందలం నుండి అదఃపాతాళానికి పడిపోయినవారు కూడా చాలామందే ఉన్నారు.
మరో బుల్లితెర నటి ఆత్మహత్య…
తెలుగు సీరియల్ నటి ఝాన్సీ మరణం మరిచిపోక ముందే తమిళనాట ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. తమిళ టీవీ, సినీ నటి యషిక ఆత్మహత్యకు పాల్పడ్డారు. చెన్నైలోని వడపళనిలో ఉన్న తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న యషిక.. తన ఆత్మహత్యకు ప్రియుడే కారణమని, అతడిని వదలొద్దంటూ తల్లికి వాట్సాప్‌లో మెసేజ్ చేశారు.
యషిక అసలు పేరు మేరీ షీలా జబరాని. తిరుప్పూరుకు చెంది ఆమె వడపళనిలోని హాస్టల్‌లో ఉండే సమయంలో అరవింద్ అలియాస్ మోహన్ బాబు అనే బిజినెస్‌మేన్‌తో ప్రేమలో పడ్డారు. గత కొంత కాలంగా వీరు సహజీవనం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మూడు రోజలు క్రితం జరిగిన ఓ గొడవతో ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తినట్టు తెలుస్తోంది. దీంతో మనస్తాపం చెందిన యషిక ఆత్మహత్యకు పాల్పడ్డారు.
యషిక ఆత్మహత్య విషయం తెలుసుకున్న పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ప్రస్తుతం విచారణ జరగుతోందని, రిపోర్డ్ వచ్చిన తరువత తదుపరి చర్యలు తీసుకోనున్నట్టుగా వెల్లడించారు. పలు తమిళ సీరియల్స్‌లో నటించిన యషిక, విమల్ హీరోగా నటించిన ‘మన్నార్ వగెరా’ సినిమాలో నటించారు.