26.4 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు తెలంగాణ మాఘశుద్ధ పౌర్ణమి రోజున తెలంగాణ కొత్త కేబినెట్ విస్తరణ

మాఘశుద్ధ పౌర్ణమి రోజున తెలంగాణ కొత్త కేబినెట్ విస్తరణ

kcr-cabinet
- Advertisement -

kcr-cabinet

హైదరాబాద్: ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 19న రాష్ట్ర మంత్రి వర్గాన్ని విస్తరించాలని సీఎం, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. కేబినెట్ విస్త‌ర‌ణ‌పై శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలిసి సీఎం తన నిర్ణయాన్ని తెలియజేశారు.

ఫిబ్రవరి 19న మాఘశుద్ధ పౌర్ణమి కావడంతో అదే రోజు ఉదయం 11.30 గంటలకు కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ నేపథ్యంలో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. కాగా, కొత్తగా 10మంది మంత్రివర్గంలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.

22న తెలంగాణ బడ్జెట్

కాగా, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి 22 నుంచి 25 వరకు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. 22న సభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టేందకు కసర్తతు చేస్తోంది. 23న బడ్జెట్ పై చర్చ.. 25న ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలపేలా షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు. ఈ మేరకు గురువారం మంత్రి కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. బడ్జెట్‌లో పొందుపరచాల్సిన అంశాలతో పాటూ ప్రభుత్వ పథకాలు, ఖర్చులపై చర్చించినట్లు తెలిసింది.

చదవండి: ఉగ్రదాడితో మనస్తాపం: పుట్టినరోజు వేడుకలు రద్దు చేసుకున్న కేసీఆర్

- Advertisement -