న్యూఢిల్లీ: ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత లెజండరీ బాక్సర్ మేరీకోమ్ పంచ్‌కు ఎదురు లేకుండా పోయింది. శనివారం జరిగిన 48 కేజీల విభాగం ఫైనల్లో ఉక్రెయిన్‌కు చెందిన హనా ఒఖోటాను 5-0తో మేరీకోమ్ మట్టి కరిపించి ఆరో స్వర్ణాన్ని సొంతం చేసుకుని ఈ మణిపురి మణిపూస చరిత్ర సృష్టించింది
మేరీకోమ్ పంచ్‌ల ముందు ప్రత్యర్థి ఏమాత్రం నిలవలేకపోవడంతో ఫలితం ఏకపక్షంగా వచ్చింది. ఫలితంగా ఆరు స్వర్ణ పతకాలు నెగ్గిన తొలి మహిళా బాక్సర్‌గా మేరీ కోమ్ నిలిచింది. ఇప్పటి వరకు చాంపియన్‌షిప్‌లో ఆరు పతకాలతో ఐర్లాండ్‌కు చెందిన కేటీ టేలర్ (5 స్వర్ణాలు, 1 కాంస్యం)తో సమంగా ఉన్న మేరీకోమ్ ఇప్పుడు ఈ విజయంతో ఆమెను అధిగమించినట్లయింది.
మేరీకోమ్ భావోద్వేగం…
తన గెలుపు అనంతరం మేరీకోమ్ భావోద్వేగానికి గురైంది. ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకోలేకపోయింది. గత కొన్నేళ్లుగా తనకు మద్దతుగా నిలుస్తున్న బాక్సింగ్ అభిమానులకు ఆమె ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపింది. ఇక 2020లో టోక్యోలో జరిగే ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించడమే తన లక్ష్యమని మేరీకోమ్ పేర్కొంది.
తాజా స్వర్ణంతో ఆమె క్యూబా పురుషుల బాక్సింగ్ దిగ్గజం ఫెలిక్స్ సవాన్ సరసన చేరింది. మేరీ 2002, 2005, 2006, 2008, 2010 బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణాలతో పాటు.. అరంగేట్ర 2001 చాంపియన్ షిప్‌లో రజతం సాధించింది.