ప్రో కబడ్డీ లీగ్: ఆరంభ మ్యాచ్‌లో తలైవాస్ ఘన విజయం..

pro kabadi
- Advertisement -

pro kabadi

చైన్నె: ప్రొ కబడ్డీ లీగ్‌ ఘనంగా ప్రారంభమైయింది. మూడుసార్లు విజేత అయిన పట్నా పైరేట్స్‌కు తమ ఆరంభ మ్యాచ్‌లోనే షాక్ తగిలింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆద్భుతంగా ఆడిన తమిళ్ తలైవాస్ 42-26తో పట్నా పైరేట్స్‌ను మట్టి కరిపించింది. ఈ మ్యాచ్‌లో మొదటి నుంచి తలైవాస్ దే దూకుడు. అజయ్ ఠాకూర్, జస్వీర్‌ సింగ్  విసృంభించడంతో తలౌవాస్ 4-1 తో ఆధిక్యంలోకి వెళ్ళింది. ప్రదీప్ నర్వాల్ ‌మధ్య మధ్యలో మెరిసినా తలైవాస్ జోరు ఏమాత్రం తగ్గలేదు. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి ఆ జట్టు 26-8తో ఆధిక్యంలో నిలిచింది.

రెండో అర్ధభాగంలో పైరేట్స్ కాస్త పుంజుకున్నా కానీ తలైవాస్ అదే దూకుడు కొనసాగించింది. మరో ఐదు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా ప్రదీప్ నర్వాల్‌ను సూపర్ ట్యాకిల్ చేసి తలైవాస్ మూడు పాయింట్లు తన ఖాతాలో వేసుకుంది. దీంతో 42-26తో పైరేట్స్ కు ఓటమి తప్పలేదు. తలైవాస్ తరపున అమిత్ హుడా నాలుగు ట్యాకిల్ పాయింట్లు, అజయ్ ఠాకూర్ 14 రైడ్ పాయింట్లు సాధించగా.. పట్నా పైరేట్స్ తరపున వికాస్ కాలె ఒక ట్యాకిల్ పాయింటు,  ప్రదీప్ నర్వాల్ 11 రైడ్ పాయింట్‌లు తెచ్చాడు. ఈ మ్యాచ్‌కు ముందు ప్రో కబడ్డీ లీగ్ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. నటి శ్రుతి హాసన్ జాతీయ గీతాన్ని ఆలపించగా, నటుడు విజయ్ సేతుపతి తదితరులు ప్రారంభోత్పవంలో పాల్లోని ఆటగాళ్లను ఉత్సాహపరిచారు.

ముంబా – పుణెరి.. పోటా పోటీ : యు ముంబా-పుణేరి   పల్టాన్‌ల మధ్య మ్యాచ్ నువ్వా నేనా అన్నట్లు సాగింది. రెండు జట్ల రైడర్‌లు పాయిట్లు తీసుకురావడంలో పోటీ పడడంతో స్కోరు 9-9, 13-13, 20-20, ఇలా మ్యాచ్ సమానంగా సాగింది. సిద్ధార్థ్ దేశాయ్ విజృంభించడంతో మ్యాచ్ ఒక దశలో యు ముంబాం 26-22తో ఆధిక్యంలోకి దూసుకెళ్ళింది. కానీ నితిన్ తోమర్ వరుసగా రైడ్ పాయింట్లు సాధిస్తూ పోవడంతో నెమ్మదిగా యు మంబాను పాయింట్లను సమీపించిన పుణెరి (24-26) ఆ తర్వాత 29-30తో మరింతత దగ్గరగా వచ్చింది.

ఒకవైపు మ్యాచ్ సమయం మించిపోతుండడం, రెండు జట్ల మధ్య ఒకే పాయిట్లు అంతరం ఉండడంతో ఏ జట్టు విజయం సాధిస్తుందా అనే ఉత్కంఠ నెలకొంది. అయితే 32-30తో ఆధిక్యంలోకి వెళ్ళిన యు ముంబా విజయానికి చేరువైంది. మోను రైడ్ పాయింట్ తీసుకు రావడంతో 31-32తో నిలిచిన పుణెరి.. ఆ తర్వాత సిద్ధార్థ్ దేశాయ్ రైడ్‌లో విఫలం కావడంతో 32-32తో స్కోర్ సమం చేసింది. ఆఖరి సెకన్‌లో మోను రైడ్‌కు వెళ్లినా పాయింట్ రాకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. గిరాష్ ఎర్నాక్ 4 ట్యాకిల్ పాయింట్లు, పుణెరి జట్టులో నితిన్ తోమర్ 15 రైడ్ పాయింట్లు,  యు ముంబా జట్టులో ఫజెల్ 4 ట్యాకిల్ పాయింట్‌లు, సిద్ధార్థ్ దేశాయ్ 14 రైడ్ పాయింట్లతో  సత్తా చాటారు.

- Advertisement -