తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ పై.. హైకోర్టులో డీకే అరుణ పిటిషన్…

DK-Aruna
- Advertisement -

 

DK-Aruna

హైదరాబాద్: కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన  తెలంగాణ ఎన్నికల షెడ్యూల్‌ను సవాల్ చేస్తూ హైకోర్టులో సోమవారం తెలంగాణ కాంగ్రెస్ నేత డీకే అరుణ పిటిషన్ వేశారు.  సోమవారం  ఈ పిటిషన్ దాఖలైంది.. పిటీషనర్ తరఫు న్యాయవాది నిరూప్ రెడ్డి  తమ వాదనలు వినిపించనున్నారు. ఈ పిటిషన్‌లో తెలంగాణలో ముందస్తుగా అసెంబ్లీని రద్దు చేయడాన్ని అరుణ ప్రశ్నించారు.

చదవండి: వీడిన ఉత్కంఠ: మోగిన ఎన్నికల నగారా, తెలంగాణలో డిసెంబర్ 7న పోలింగ్, 11న ఫలితాలు

తెలంగాణ ప్రభుత్వాన్ని రద్దు చేసిన తీరు రాజ్యాంగ విరుద్ధమని, ఎమ్మెల్యేలకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా , శాననసభను సమావేశ పర్చకుండా ప్రభుత్వాన్ని 9 నెలల ముందే ఎలా రద్దు చేస్తారని ఆ  పిటిషన్‌లో డీకే అరుణ ప్రశ్నించారు.  ఇది శాసనసభ్యుల హక్కుల్ని కాలరాయడమేనని అన్నారు. అయితే హైకోర్టు ఈ పిటిషన్‌ పై ఎలా స్పందిస్తుందో అన్నది ఆశక్తికర అంశం.

 

- Advertisement -