‘సాహో’ సినిమా షూటింగ్ జరుగుతుండగానే మరో సినిమాకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఓకే చెప్పిన విషయం తెలిసిందే. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఇటలీలో జరుగుతుంది. ఈ సినిమాకి రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే సినిమాకి ఎంతో ఆసక్తికరమైన టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ సినిమాకి తెలుగు టైటిల్ కాకుండా ఫ్రెంచ్ టైటిల్ ‘అమూర్’ అనే ఆ చిత్ర యానిట్ పరిశీలిస్తోందట… ఈ సినిమా లవ్ & రొమాంటిక్ ఎంటర్‌టైనర్ అన్న విషయం తెలిసిందే… ఆ విషయన్ని టైటిల్‌లో తెలిసే విధంగా పెట్టారు… ‘అమూర్’ అంటే ఫ్రెంచ్‌లో ప్రేమ అని అర్థం వస్తుంది.
ఈ సినిమా 1970లో సాగే ప్రేమకథ అని… ఇది ఒక పిరియాడికల్ ప్రేమకథ అని తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ పక్కన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ విషయాని తనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఈ సినిమా షూటింగ్ ఎక్కవ భాగం యూరప్‌లో జరుగుతోంది.