
ట్టు
పుణే: ప్రోో కబడ్డీ లీగ్ 2018 సీజన్-6లో తెలుగు టైటాన్స్‌కు యు ముంబా చేతిలో ఘోర పరాజయం ఎదురైంది. మంగళవారం జరిగిన పోరులో యు ముంబా 41–20స్కోరుతో తెలుగు టైటాన్స్‌పై భారీ విజయాన్ని సాధించింది. యు ముంబా రైడర్ సిద్ధార్థ్ దేశాయ్ 19 సార్లు రైడింగ్‌కు వెళ్లి 17 పాయింట్లు తెచ్చి అసాధారణ ప్రదర్శన కనబరిచాడు.
మిగిలిన ఆటగాళ్లలో వారిలో ఫజల్ అత్రాచలి 4 పాయింట్లు, సురేందర్ 2 పాయింట్లు, వినోద్ పాయింట్లు, అబొల్ఫజల్ 2 పాయింట్లు యు ముంబా విజయంలో తలో చేయి వేసి 41-20 తో ఆ జట్టుకు భారీ విజయన్ని అందిచారు.
స్టార్ రైడర్ రాహుల్ చౌదరి రికార్డు…
మంగళవారం తెలుగు టైటాన్స్ స్టార్ రైడర్ రాహుల్ చౌదరి ప్రొ కబడ్డీ లీగ్ చరిత్రలోనే 700 పాయింట్లు సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అయినా సరే తెలుగు టైటాన్స్‌ను మాత్రం అతడు ఓటమి నుంచి కాపాడలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో రాహుల్ చౌదరి 15 సార్లు రైడింగ్‌కు వెళ్లి కేవలం 7 పాయింట్లు మాత్రమే తెచ్చాడు. ఫర్హాద్ 4 పాయింట్లు, అనిల్ 2 పాయింట్లు, మోసిన్ 2 పాయింట్లు, అర్మాన్ 2 పాయింట్లు తీసుకొచ్చినా ఫలితం లేకుండాపోయింది
పుణేరి పల్టన్‌పై తమిళ్ తలైవాస్ గెలుపు…
ఆ తరువాత జరిగిన రెండో మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ జట్టు 36–31 స్కోరుతో పుణేరి పల్టన్ జట్టుపై గెలుపొందింది. తలైవాస్ తరఫున అజయ్ ఠాకూర్ 12 పాయింట్లతో అదరగొట్టాడు. జస్వీర్ 8 పాయింట్లు, మంజీత్ చిల్లర్ 4 పాయింట్లతో.. తమిళ్ తలైవాస్ విజయంలో కీలక పాత్ర పోషించారు. పుణేరి పల్టన్ జట్టు తరఫున నితిన్ తోమర్ కూడా 8 పాయింట్లుతో ఆకట్టుకున్నాడు. రవికుమార్ 4 పాయింట్లు, మోను 3 పాయింట్లు తీసుకొచ్చారు.
ప్రొ కబడ్డీ లీగ్‌లో బుధవారం మ్యాచ్‌లు..
బెంగళూరు బుల్స్ x హర్యానీ స్టీలర్స్ …. పుణేరి పల్టన్ x యూపీ యోధా







