నొయిడా: ప్రో కబడ్డీ లీగ్ 2018 సీజన్-6లో మూడు వరుస పరాజయాలు చవిచూసిన దబాంగ్ ఢిల్లీ జట్టు ఎట్టకేలకు విజయాన్ని సొంతం చేసుకుంది. గురువారం హర్యానా స్టీలర్స్ జట్టుతో హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో 39-33 స్కోరు తేడాతో దబాంగ్ ఢిల్లీ జట్టు గెలిచింది.
దబాంగ్ ఢిల్లీ రైడర్ నవీన్ కుమార్ 9 రైడ్ పాయింట్లు సాధించగా.. మిరాజ్ షేక్ 6 పాయింట్లు, చంద్రన్ రంజిత్ 6 పాయింట్లు సాధించారు. డిఫెండర్ రవీందర్ పహల్ 6 టాకిల్ పాయింట్లతో ఆకట్టుకున్నాడు.
హర్యానా స్టీలర్స్ జట్టులో మోను గోయత్ 11 పాయింట్లు సాధించినా తమ జట్టును గెలిపించలేకపోయాడు.
మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 37-27 స్కోరుతో యూపీ యోధా జట్టుపై గెలిచింది. బెంగళూరు బుల్స్ నుంచి పవన్ సెహ్‌రావత్ 10 రైడ్ పాయింట్లు సాధించాడు.
ఇక ప్రో కబడ్డీ లీగ్‌లో శుక్రవారం నుంచి ముంబై వేదికగా మ్యాచ్‌లు జరుగనున్నాయి.
ప్రో కబడ్డీ లీగలో శుక్రవారం జరిగే మ్యాచ్‌లు…
తెలుగు టైటాన్స్ x బెంగాల్ వారియర్స్
యు ముంబా x జైపూర్ పింక్ పాంథర్స్