గంటకు 46,500 కిలోమీటర్ల వేగంతో.. భూమి వైపు దూసుకొస్తోన్న భారీ ఉల్క

- Advertisement -

న్యూఢిల్లీ: ఈ నెల 21న యుగాంతం సంభవిస్తోందంటూ మయాన్ కేలండర్ చెప్పినది ఒట్టిదేనని తేలిపోయింది. నిన్నటి వరకు ఈ పుకార్లతో సోషల్ మీడియా హోరెత్తిపోయింది.

అయితే, 21 వచ్చింది, వెళ్లింది. కానీ యుగాంతం మాత్రం జరగలేదు. ప్రపంచం యధావిధిగా నడుస్తోంది. అయితే, ఇప్పుడు ఇంకో ఉపద్రవం వచ్చిపడింది.

ఈ నెల 24న, అంటే ఎల్లుండి అతి పెద్ద ఉల్క భూమిని ఢీకొట్టబోతోందన్న వార్తలు ఇప్పుడు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.

ఈ ఉల్క దాదాపు మన కుతుబ్ మీనార్ అంత ఉండబోతోందట. జూన్ 24న మధ్యాహ్నం 12:15 గంటలకు ఇది భూమికి అత్యంత సమీపంగా రానున్నదట. దీనికి 2010NY65 అని పేరు కూడా పెట్టారు.

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ సమాచారం ప్రకారం ఈ ఉల్క గంటకు 46,500 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోందట.

2013లో రష్యాలో పడిపోయిన ఉల్క కంటే ఇది 15 రెట్లు పెద్దదిగా ఉంటుందని భావిస్తున్నారు. కాగా, జూన్ 6, 8 తేదీల్లో కూడా రెండు గ్రహశకలాలు భూమికి ఇలాగే దగ్గరగా వచ్చాయి.

- Advertisement -