మందుబాబులకు బ్యాడ్ న్యూస్! డిసెంబర్ 5 నుంచి 7 వరకు మద్యం షాపులు బంద్, మళ్లీ…

wine shops closed upto 5 to 7 in telangana for telangana election 2018
- Advertisement -

wine shops closed upto 5 to 7 in telangana for telangana election 2018

హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో మద్యం ప్రియులకు కష్టాలు తప్పేలా లేవు. తెలంగాణలో ఎన్నికలు జరిగే డిసెంబర్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు రోజుల పాటు మద్యం షాపులు మూతపడనున్నాయి.  ఈ మేరకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణలో డిసెంబర్ 7న ఎన్నికలు జరగుతుండగా డిసెంబర్ 11వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ క్రమంలో డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 7వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు తెలంగాణ వ్యాప్తంగా మద్యం షాపులు మూత పడనున్నాయి.

అదే విధంగా డిసెంబర్ 11వ తేదీన కూడా మద్యం షాపులు బంద్ కానున్నాయి. తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎక్సైజ్ శాఖ అధికారులు  తెలిపారు.

చదవండి: సీ-ఓటర్‌ సర్వే: తెలంగాణలో మహాకూటమి ప్రభంజనం..!? టీఆర్ఎస్‌కి 42 స్థానాలేనా?

- Advertisement -