హైదరాబాద్: ఓ నిండు కుటుంబం ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలతో ఛిద్రమయిపోయింది. తన భార్య మాటిమాటికి గొడవ పడటంతో తట్టుకోలేకపోయిన భార్త ఆమెను హత్య చేసి అనంతరం పోలీసు స్టేషన్‌కి వెళ్ళి పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని జగద్గిరిగుట్టలో చోటుచేసుకుంది..
పొలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పశ్చిమగోదావరి జిల్లా రామాపురానికి చెందిన వెంకటేశ్ (24), లక్ష్మి(20)లు మూడు నెలల క్రితం హైదరాబాద్‌కు వలస వచ్చారు. ఈ దంపతులకు ఒక కుమార్తె(3) కూడా ఉంది.
అపార్ట్ మెంట్‌లో వాచ్ మెన్‌గా పని చేస్తూ…
వెంకటేశ్ జగద్దిరిగుట్టలో ఉన్న బాలాజీ లేఅవుట్ డాల్ఫిన్ అపార్ట్ మెంట్‌లో వాచ్ మెన్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే వాచ్‌మెన్ ఉద్యోగం ద్వారా చాలీచాలని జీతం వస్తుండటంతో కుటుంబ పోషణ విషయంమై ఈ దంపతులు మధ్య తరచూ గొడవలు చోటుచేసుకునేవి.
ఈ క్రమంలో శుక్రవారం రాత్రి వెంకటేశ్ ఫుల్‌గా మద్యం సేవించి ఇంటికొచ్చాడు. దీంతో వెంకటేశ్, లక్ష్మిల మధ్య మళ్లీ గొడవ జరిగింది. ఈ సందర్భంగా సహనం కోల్పోయిన వెంకటేశ్ పక్కనే ఉన్న చున్నీని తీసుకుని భార్య లక్ష్మి గొంతుకు బిగించాడు. దీంతో ఆమె ఊపిరాడక మరణించింది.
అనంతరం అతడు చేసిన తప్పు తెలుసుకుని నేరుగా పోలీష్ స్టేషన్‌కు వెళ్ళి పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: టీడీపీ నేత దారుణ హత్య: కళ్లలో కారం చల్లి.. వేట కొడవళ్లతో వెంటాడి…
చదవండి: షాకింగ్: మద్యం మత్తులో.. సొంత చెల్లెలిపైనే.. అన్నఅత్యాచారం, తండ్రి నిద్రపోగానే…
చదవండి: ఘోరం: అటవీశాఖ వెదురు డిపోలో యువతి మృతదేహం! హత్యకు ముందు అత్యాచారం.. ప్రియుడిపైనే పోలీసుల అనుమానం
చదవండి: షాకింగ్: బాలికను బెదిరిస్తూ.. నాలుగేళ్లుగా వసతి గృహం సూపరింటెండెంట్ కీచకపర్వం